Loading...
Australia Cricket Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి సాండ్‌పేపర్ గేట్ కలకలం.. మింట్స్‌తో బాల్ ట్యాంపరింగ్‌కు ప్లాన్!
ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి సాండ్‌పేపర్ గేట్ కలకలం.. మింట్స్‌తో బాల్ ట్యాంపరింగ్‌కు ప్లాన్!

Australia Cricket Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి సాండ్‌పేపర్ గేట్ కలకలం.. మింట్స్‌తో బాల్ ట్యాంపరింగ్‌కు ప్లాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును మరో వివాదం చుట్టుముట్టింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా నిలిచిన 2018 కేప్‌టౌన్ సాండ్‌పేపర్ గేట్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతం జరిగి దాదాపు ఎనిమిదేళ్లు గడిచినా ఆ వివాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియా ప్రముఖ జర్నలిస్ట్ జెరార్డ్ వాట్లీ (Gerard Whateley) SEN మీడియా కోసం నిర్వహించిన పరిశోధనలో కంగారూ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. కేప్‌టౌన్ ఘటన జరిగిన కొన్ని నెలలకే, 2018 అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో దుబాయ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు మింట్స్ (చాక్లెట్లు) ఉపయోగించి బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించారన్న విషయం బయటపడింది.

వివరాలు

దుబాయ్ టెస్టులో మింట్స్‌తో బాల్ ట్యాంపరింగ్ ప్లాన్?

అయితే అప్పటి కెప్టెన్ టిమ్ పైన్ అప్రమత్తమై ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు తాజా పరిశోధన వెల్లడించింది.

2018 అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లకు బంతి నుంచి ఆశించిన స్వింగ్ లభించలేదు.

దీంతో కొందరు ఆటగాళ్లు బంతిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాత పద్ధతులను అనుసరించాలని భావించినట్లు వాట్లీ పరిశోధనలో వెల్లడైంది.

మైదానంలో ఉన్న ఓ ఆసీస్ ఆటగాడు.. మింట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ రోజు బంతిని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? అని అడిగినట్లు సమాచారం.

దీనిపై మరో ఆటగాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేప్‌టౌన్ ఘటన తర్వాత కూడా ఇలాంటి రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించినట్లు నివేదిక పేర్కొంది.

వివరాలు

టిమ్ పైన్ అడ్డుకోవడంతో ఆగిన ప్రయత్నం

ఈ పరిణామాల మధ్య డ్రెస్సింగ్ రూమ్ నుంచి మింట్స్ తీసుకురావడానికి ఓ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ను పంపించినట్లు తెలుస్తోంది.

అయితే అప్పటి కెప్టెన్ టిమ్ పైన్ ఈ విషయాన్ని గమనించాడు. వాటిని మైదానంలోకి తీసుకురావద్దని సైగ చేసి, ఆ ఆటగాడిని వెనక్కి పంపించినట్లు పరిశోధనలో వెల్లడైంది.

బ్యాగీ గ్రీన్ క్యాప్‌తో లాంగర్ ఆగ్రహం

ఆ రోజు ఆట ముగిసిన తర్వాత హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు నివేదిక తెలిపింది.

ఆస్ట్రేలియా క్రికెట్‌కు ప్రతీకగా భావించే బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను తన వెనుక భాగంపై తుడుచుకుంటూ.. ఆటగాళ్ల చర్యలు జట్టు గౌరవాన్ని ఎంతగా దిగజారుస్తున్నాయో ఆయన ప్రదర్శించినట్లు పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

బ్యాన్‌క్రాఫ్ట్‌ను బలిపశువును చేయొద్దు.. వార్నర్‌పై మార్ష్ ఆగ్రహం

2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన కేప్‌టౌన్ టెస్టులో సాండ్‌పేపర్ ఉదంతం బయటపడిన తర్వాత హోటల్ గదిలో చోటుచేసుకున్న పరిణామాలు కూడా తాజా పరిశోధనలో వెల్లడయ్యాయి.

తొలుత కామెరాన్ బ్యాన్‌క్రాఫ్ట్ (బ్యాంగర్స్) తప్పు మొత్తాన్ని తనపై వేసుకోవడానికి సిద్ధపడగా, స్టీవ్ స్మిత్ కూడా బాధ్యత పంచుకోవడానికి ముందుకొచ్చాడు.

అయితే ఈ కుట్రలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్ మాత్రం బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

దీంతో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ హోటల్‌లో వార్నర్‌ను గట్టిగా నిలదీసినట్లు నివేదిక పేర్కొంది.

ADVERTISEMENT