LOADING...
Donald Trump : ఇరాన్‌పై దాడులు ఆగవు.. ట్రంప్ హెచ్చరిక!
ఇరాన్‌పై దాడులు ఆగవు.. ట్రంప్ హెచ్చరిక!

Donald Trump : ఇరాన్‌పై దాడులు ఆగవు.. ట్రంప్ హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు ఇప్ప‌ట్లో ఆగే పరిస్థితి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండాలంటే ఈ దాడుల ప్రభావం శాశ్వతంగా ఉండేలా చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇప్పటికే జరిగిన దాడుల వల్ల ఇరాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. మేము ఈరోజే వెనక్కి వెళ్లిపోయినా, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి వారికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. అయితే అది మరింత శాశ్వతంగా ఉండేలా చేయాలి, తద్వారా భవిష్యత్తులో ఎవరైనా అధ్యక్షుడు ఈ సమస్యను ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదని చెప్పారు.

Details

ఎవ్వ‌రూ ఉహించ‌ని ఫ‌లితాల‌ను సాధించాం

ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా అడ్డుకోవడమే ఈ యుద్ధ లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ మళ్లీ ఎప్పుడూ అణు ముప్పుగా మారకూడదు. అణ్వాయుధాలు అజ్ఞానుల చేతుల్లో ఉండటాన్ని మేము అనుమతించలేమ‌ని అన్నారు. యుద్ధం అమెరికా అనుకూలంగా సాగుతోందని ఆయన తెలిపారు. అమెరికా, మిత్ర దేశాల దాడులతో ఇరాన్ సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నదని చెప్పారు. యుద్ధం చాలా బాగా సాగుతోంది. మేము మంచి పని చేశాం. ఎవ్వరూ ఊహించని ఫలితాలను సాధించామ‌ని ట్రంప్ పేర్కొన్నారు. ఇక అమెరికా ముందుగానే చర్యలు తీసుకోకపోతే ఇరాన్ ఇప్పటికే అణు సామర్థ్యం సాధించి ఉండేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Details

అక్కడి నాయకత్వంపై కూడా అనిశ్చితి నెల‌కొంది

వారు కేవలం రెండు వారాల దూరంలోనే ఉన్నారు. అప్పటికి చర్చలకు అవకాశం ఉండేది కాదు. వారు అణ్వాయుధాలను వినియోగించే పరిస్థితి వచ్చేదని తెలిపారు. అయితే దాడులు కొనసాగుతున్నప్పటికీ, అమెరికా దళాల ఉపసంహరణపై స్పష్టత ఇవ్వలేదు. మేము ఇంకా వెళ్లడానికి సిద్ధంగా లేము. కానీ చాలా త్వరలోనే వెళ్లిపోతామ‌ని ట్రంప్ అన్నారు. మరో సందర్భంలో ఈ యుద్ధాన్ని తాత్కాలిక చర్యగా అభివర్ణిస్తూ ఇంకా కొన్ని వారాలు మాత్రమేన‌ని చెప్పారు. ఇటీవల జరిగిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు కీలక నాయకులు మృతిచెందిన నేపథ్యంలో అక్కడి నాయకత్వంపై కూడా అనిశ్చితి నెలకొన్నదని ట్రంప్ అంగీకరించారు.

Advertisement

Details

నాటో దేశాలపై ట్రంప్ విమర్శలు

మేము ఇప్పుడు ఎవరితో మాట్లాడాలో కూడా స్పష్టంగా తెలియడం లేదని అన్నారు. అదేవిధంగా హోర్ముజ్ జలసంధి భద్రత విషయంలో సహకరించలేదని నాటో దేశాలపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. నాటో పెద్ద తప్పు చేస్తోంది. ప్రపంచానికి కీలకమైన ఈ మార్గం భద్రత కోసం వారు ముందుకు రావడం లేదని అన్నారు. భూమిపై దీర్ఘకాలిక యుద్ధం జరిగే అవకాశాలపై వచ్చిన ప్రశ్నలకు స్పందిస్తూ, నాకు ఎలాంటి భయం లేదని ట్రంప్ చెప్పారు. ఇరాన్ యుద్ధం అమెరికా విదేశాంగ విధానాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తోంది. ఈ పరిణామాల కారణంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తో జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడినట్లు సమాచారం.

Advertisement