LOADING...
Jio: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. జియో నుంచి నూత‌న‌ క్యాష్ విత్‌డ్రా సేవలు
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. జియో నుంచి నూత‌న‌ క్యాష్ విత్‌డ్రా సేవలు

Jio: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. జియో నుంచి నూత‌న‌ క్యాష్ విత్‌డ్రా సేవలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2026
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెందిన అనుబంధ సంస్థ జియో పేమెంట్స్ బ్యాంక్ యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణ సేవలను తాజాగా ప్రారంభించింది. టచ్ పాయింట్ల వద్ద తమ బిజినెస్ కరెస్పాండెంట్ల ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కొత్త సేవలను ప్రవేశపెట్టినట్లు సంస్థ వెల్లడించింది.

Details

వినియోగ‌దారుల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంతం

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పాక్షిక పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చినట్లు తెలిపింది. ఈ విధానంలో వినియోగదారులు తమ యూపీఐ యాప్‌ను ఉపయోగించి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా నగదును ఉపసంహరించుకోవచ్చు. దీనికి డెబిట్ కార్డు లేదా ఏటీఎం అవసరం ఉండదని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పష్టం చేసింది.

Advertisement