20 Sea Ambulances: 2027 మార్చిలోగా పసిఫిక్ దేశాలకు 20 సముద్ర అంబులెన్సులు
ఈ వార్తాకథనం ఏంటి
పసిఫిక్ ద్వీప దేశాలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. 2027 మార్చి నాటికి 20 సముద్ర అంబులెన్సులను అందించనున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా జరిగిన ఫోరం ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (FIPIC) విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 12 పసిఫిక్ ద్వీప దేశాల నుంచి 20 సముద్ర అంబులెన్సుల కోసం భారత్‌కు అభ్యర్థనలు అందాయని, వాటి సరఫరా ప్రక్రియ కొనసాగుతోందని జైశంకర్ చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పసిఫిక్ దీవులకు భారత్ అండ..
Pleased to chair the India-FIPIC Foreign Ministers’ Meeting today in New York #UNGA81. Underlined the following:
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 23, 2026
✅ Our approach to the Pacific has consistently been demand-driven, development-oriented and people-centric.
✅ India fully respects and supports the priorities… pic.twitter.com/hSFhG3gaKj
వివరాలు
ఫిజీలో భారత్ 100పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
పసిఫిక్ ప్రాంతంలో అనేక దేశాలు చిన్నచిన్న ద్వీపాలుగా విస్తరించి ఉండటంతో అత్యవసర వైద్య సేవలు అందించడం సవాలుగా ఉంది.
ముఖ్యంగా ప్రధాన వైద్య కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో రోగులను త్వరగా ఆసుపత్రులకు తరలించేందుకు సముద్ర అంబులెన్సులు ఉపయోగపడనున్నాయి.
అత్యవసర పరిస్థితుల్లో వైద్య తరలింపులకు ఇవి కీలకంగా మారనున్నాయి. ఇదే సమయంలో ఫిజీలో భారత్ 100పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తోంది.
ఈ ఆసుపత్రి ఫిజీతో పాటు ఇతర పసిఫిక్ ద్వీప దేశాల ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందించేందుకు ఉపయోగపడనుంది.
పాపువా న్యూ గినీ, సోలమన్ దీవులు, సమోవా, పలావు, నౌరు, కిరిబాటి, మార్షల్ దీవులకు భారత్ ఇప్పటికే డయాలసిస్ యంత్రాలను అందించింది. మరో నాలుగు దేశాలకు సరఫరా ప్రక్రియ కొనసాగుతోంది.
వివరాలు
14 పసిఫిక్ ద్వీప దేశాల్లో 2,800 ఇళ్లకు సౌర విద్యుత్
భారత్-పసిఫిక్ సహకారం వైద్య రంగానికే పరిమితం కాలేదు. 14 పసిఫిక్ ద్వీప దేశాల్లో 2,800 ఇళ్లకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించింది.
70 మంది మహిళా సౌర ఇంజినీర్లకు శిక్షణ ఇచ్చింది. ఐటీ రంగంలోనూ శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను చేపడుతోంది.
ఫిజీలో త్వరలో నిర్వహించనున్న కృత్రిమ అవయవాల అమరిక శిబిరం ద్వారా సుమారు 650 మంది రోగులకు ప్రయోజనం కలగనుంది.