విరాట్ కోహ్లీ: వార్తలు
24 Mar 2023
క్రికెట్విరాట్ కోహ్లీ న్యూ లుక్ అదుర్స్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. టీమిండియా రన్‌మెషీన్ కోహ్లీ కొత్త లుక్‌తో అభిమానులకు దర్శనమిచ్చారు.
23 Mar 2023
క్రికెట్వన్డేల్లో 65 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ఓటమిపాలైంది. ముంబై విజయంతో ఆరంభించిన రోహిత్ సేన గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో సిరీస్ కూడా చేజారిపోయింది. చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
22 Mar 2023
క్రికెట్వికెట్ల మధ్య ధోని కంటే ఫాస్టెస్ట్ రన్నర్ ఏబీ డివిలియర్స్ : విరాట్ కోహ్లీ
మైదానంలో వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే బ్యాటర్లలో టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ కచ్చితంగా ముందు స్థానంలో ఉంటాడు. సాధారణంగా మనిషి గంటకు 12-13 కిమీ వేగంగా పరిగెత్తగలడు. కానీ విరాట్ కోహ్లీ 24-25 కిమీ వేగంతో పరిగెత్తే సత్తా ఉంది.
22 Mar 2023
క్రికెట్ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ను ఇస్తుంది. మ్యాచ్ ఎప్పుడు జరిగినా వాతావరణం ఇరుపక్షాల మధ్య హీట్‌గా ఉంటుంది. అయితే స్లెడ్జింగ్ చేయడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఎప్పుడు ముందు ఉంటారు.
21 Mar 2023
క్రికెట్కుంబ్లే తో గొడవ తరువాత.. కోచ్ గా ఉండాలని కోహ్లీ కోరాడు : సెహ్వాగ్
టీమిండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే 2016లో భారత ప్రధాన కోచ్ గా పదవి బాధ్యతలను చేపట్టాడు. అయితే 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ అనంతరం ఆ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. కుంబ్లే స్థానంలో అప్పటివరకు టీమిండియా క్రికెట్ డైరక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి హెడ్ కోచ్ బాధ్యతలను తీసుకున్నాడు.
21 Mar 2023
క్రికెట్రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ వంద సెంచరీలు చేస్తాడు: ఆసీస్ ఆల్ రౌండర్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ తో జరిగిన చివరి టెస్టులో సెంచరీ చేసి కోహ్లీ అదరగొట్టాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీల సంఖ్య 75కి చేరింది. అయితే అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తర్వాత రెండో స్థానంలో కోహ్లీ ఉన్నాడు.
18 Mar 2023
క్రికెట్వామ్మో.. రన్నింగ్‌లో బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తిన కోహ్లీ
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మైదానంలో చురుగ్గా ఫీల్డింగ్ చూస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. ఫిట్నెస్ విషయంలో కోహ్లీని పలువురు క్రికెటర్లు ఆదర్శంగా తీసుకుంటుంటారు.
17 Mar 2023
క్రికెట్విరాట్ కోహ్లీని లెగ్ స్పిన్నర్ అడమ్ జంపా ఔట్ చేస్తాడా..?
ప్రపంచ క్రికెట్లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానముంది. కోహ్లీ దేశం సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో మైలురాళ్లను ఒకటోకటిగా బద్దలుకొడుతూ రికార్డులను సృష్టించాడు. ప్రస్తుతం నేటి నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే సిరీస్‌లో తలపడనుంది.
17 Mar 2023
క్రికెట్విరాట్ కోహ్లీ ఎప్పటికీ వరల్డ్ క్లాస్ ప్లేయరే : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని, ఇప్పుడు అతని బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు.
16 Mar 2023
క్రికెట్ఆస్ట్రేలియాపై కోహ్లీ సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి
ఇటీవల వన్డేల్లో సూపర్ ఫామ్ ను అందుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో సత్తా చాటాడు. దీంతో తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ప్రస్తుతం కోహ్లీపై అంచనాలు పెరిగిపోయాయి.
15 Mar 2023
క్రికెట్ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన భారత ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో సెంచరీతో సత్తా చాటిన టీమిండియా స్టార్ ఆటగాడు కింగ్ కోహ్లీ (705) ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకున్నాడు.
13 Mar 2023
ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ
ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీని కొట్టినందుకు భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీకి నటి అనుష్క శర్మ అతిపెద్ద చీర్‌లీడర్‌గా మారారు. అతను నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌పై తన చివరి టెస్టు సెంచరీని సాధించాడు.
10 Mar 2023
క్రికెట్IND vs AUS:విరాట్ కోహ్లీ క్యాచ్‌ల్లో 'ట్రిపుల్ సెంచరీ'
అహ్మదాబాద్ వేదికగా ఇండియా- ఆస్ట్రేలియా నాలుగో టెస్టు రికార్డులకు వేదికగా మారింది. రెండు రోజుల్లోనే బోలెడు రికార్డులు నమోదయ్యాయి. ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు.
02 Mar 2023
క్రికెట్అంపైర్ నితిన్ మీనన్‌పై కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్
ఇండోర్ టెస్టులో అంపైర్ నితిన్ మీనన్ ఘోర తప్పిదాలు చేశారు. తొలి టెస్టులో ఫస్ట్ బాల్కే రోహిత్ శర్మ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చినప్పటికీ అంపైర్ స్పందించలేదు. అదే ఓవర్లో నాలుగో బంతికి స్కార్ట్క్ ఎల్బీ కోసం అపీల్ చేయగా.. అంపైర్ అడ్డంగా తల ఊపాడు.
01 Mar 2023
క్రికెట్INDvsAUS : మళ్లీ నిరాశపరిచిన విరాట్ కోహ్లీ.. నిరుత్సాహంలో ఫ్యాన్స్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా తరుపున అరంగేట్రం చేసిన టాడ్ మార్ఫీ తొలి టెస్టులోనే ఆకట్టుకున్నాడు. ఢిల్లీ టెస్టులో ఫర్వాలేదనిపించాడు. నిన్నమెన్నటి వరకు ఆస్ట్రేలియా క్రికెట్ లో పెద్దగా ఎవరికి తెలియని పేరు టాడ్ మార్ఫీ. ఇప్పుడు విరాట్ కోహ్లీని వరుసగా మూడుసార్లు అవుట్ చేసిన మర్ఫీ ఆసీస్‌లో స్టార్ ప్లేయర్ అయిపోయాడు.
28 Feb 2023
క్రికెట్కోహ్లీ, బాబర్‌ను అవుట్ చేయాలి : పాక్ స్టార్ పేసర్
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం తమ డ్రీమ్ అని ఎంతోమంది బౌలర్లు చెబుతుంటారు. కోహ్లీ క్రీజులో నిల్చుకుంటే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు, అందుకే ప్రతి మ్యాచ్‌లోనూ కోహ్లీ వికెట్ కీలకం. ఎలాగైనా కోహ్లీ వికెట్ తీయాలని బౌలర్లు శ్రమిస్తుంటారు. ప్రస్తుతం కోహ్లీ వికెట్ తీయడం తన లక్ష్యమని పాకిస్తాన్ యువ స్టార్ పేసర్ హారిస్ పేర్కొన్నారు.
23 Feb 2023
క్రికెట్మరో రికార్డుపై కన్నేసిన కింగ్ కోహ్లీ
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టులో అత్యంత వేగంగా 25వేలు పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
18 Feb 2023
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీIND vs AUS, 2nd Test: విరాట్ కోహ్లి ఔట్‌పై రాజుకున్న వివాదం
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ ఔట్‌పై ప్రస్తుతం వివాదం రాజుకుంది. ఢిల్లీ టెస్టులో విరాట్ కోహ్లీ వివాదాస్పదరీతిలో ఔటయ్యాడు. బంతికి బ్యాట్‌కి తాకి అనంతరం ఫ్యాడ్‌కి తాకినట్లు రిప్లైలో కనిపిస్తున్నా కోహ్లీ ఔట్ అంటూ ప్రకటించారు. దీనిపై థర్డ్ ఆంపైర్ కూడా స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోవడం గమనార్హం.
11 Feb 2023
క్రికెట్విరాట్ కోహ్లీని దాటేసిన మహ్మద్ షమీ
టెస్టు క్రికెట్లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లీ కన్నా అత్యధిక సిక్స్ లు బాదిన బ్యాటర్ మహ్మద్ షమీ నిలిచాడు. టెస్టులో విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ టెస్టులో 24 సిక్సర్లు కొట్టగా.. మహ్మద్ షమీ 25 సిక్స్ లు కొట్టాడు. నాగ్ పూర్ జరిగిన మొదటి టెస్టులో మహ్మద్ షమీ మూడు సిక్సర్లు కొట్టి ఈ ఘనతను సాధించాడు.
10 Feb 2023
క్రికెట్37 టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయని విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును అధిగమించే క్రికెటర్ విరాట్ కోహ్లీనే అని క్రికెట్ దిగ్గజాలు చెబుతుంటారు. అయితే టెస్టులో మాత్రం విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. గత 37 టెస్టు ఇన్నింగ్స్ లో ఒక సెంచరీ కూడా చేయకపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.
04 Feb 2023
క్రికెట్కింగ్ కోహ్లీపైనే అందరి చూపులు..!
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ అంటే అంత సులభమేమీ కాదు, ప్రస్తుతం అందరి చూపు ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఆసీస్ టెస్టు సిరీస్ పైనే ఉంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌లో కింగ్ కోహ్లీపై అంచనాలు పెరిగిపోయాయి.
04 Feb 2023
టీమిండియాకోహ్లీని దూషించిన పాక్ పేసర్ సోహైల్ ఖాన్..!
2015 ఫిబ్రవరిలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్- పాకిస్తాన్ తలపడింది. ఈ చిరకాల ప్రత్యర్థి పోరులో ఎప్పటిలాగే టీమిండియానే గెలుపొందింది. ఈ విజయంలో కింగ్ కోహ్లీ వన్ డౌన్ లో వచ్చి ముఖ్య పాత్ర వహించిన విషయం తెలిసిందే.
03 Feb 2023
క్రికెట్స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కింగ్ కోహ్లీకి కష్టమే..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పాటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
27 Jan 2023
క్రికెట్టీమిండియా విరాట్ కోహ్లీపైనే ఆధారపడి ఉంది: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్
టెస్టులో ఆల్ టైం సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీతో విభేదాలు కారణంగా 2022 జనవరిలో అర్ధాంతరంగా కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.
25 Jan 2023
క్రికెట్విరాట్ కంటే నేనే బెటర్ : పాకిస్తాన్ ప్లేయర్
వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది దిగ్గజ ప్లేయర్లు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. దాదాపుగా రెండు శతాబ్దాల క్రికెట్ ఆటగాళ్లలో డాన్ బ్రాడ్ మన్, వివ్ రిచర్డ్స్, సునీల్ గవాస్కర్, సచిన్, షేన్ వార్న్ లాంటి దిగ్గజాలను ప్రపంచం చూసింది. ప్రస్తుతం ఆ దిశగా విరాట్ కోహ్లీ ప్రయాణిస్తున్నారు. ఎందకంటే అతడు నమోదు చేసిన గణాంకాలను చూస్తేనే కోహ్లీ ప్రతిభ ఎంటో తెలుసుకోవచ్చు.
24 Jan 2023
రాహుల్ ద్రావిడ్విరాట్ స్థానంపై ద్రవిడ్ సూటిగా సమాధానాలు
న్యూజిలాండ్‌తో మూడో వన్డే కోసం భారత్ సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక విషయాలను చెప్పారు.
18 Jan 2023
భారత జట్టురికార్డులను వేటాడేందుకు సై అంటున్న కింగ్ కోహ్లీ
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ సెంచరీలతో చరిత్రను తిరగరాశాడు. స్వదేశంలో వన్డే ఫార్మాట్లో 21 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.
18 Jan 2023
భారత జట్టుటాప్ 4లోకి విరాట్ కోహ్లీ, టాప్ 3లోకి సిరాజ్
ఇటీవల ముగిసిన శ్రీలంక సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలు సాధించారు. విరాట్ కోహ్లీ నాలుగు మ్యాచ్‌ల గ్యాప్‌లో మూడు సెంచరీలతో దుమ్మురేపాడు.
17 Jan 2023
భారత జట్టురోనాల్డ్ కంటే విరాట్ తక్కువేం కాదు : పాక్ మాజీ కెప్టెన్
విరాట్ కోహ్లీ 14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఎన్నో తిరుగులేని రికార్డులను సాధించాడు. ప్రస్తుతం ఈ తరంలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్ గా టాప్ లో ఉన్నాడు. ఆదివారం శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో 110 బంతుల్లో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు.
16 Jan 2023
క్రికెట్విరాట్ నీది మరో లెవల్ ఇన్నింగ్స్ : ఏబీ డివిలియర్స్
శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించి రికార్డులను బద్దలు కొట్టింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 317 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.
16 Jan 2023
క్రికెట్రికార్డుల మోత మోగించిన కింగ్ విరాట్ కోహ్లీ
శ్రీలంకతో జరిగిన 50వ వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీని నమోదు చేశాడు. శ్రీలంక జట్టుపై 10 వన్డే సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా కోహ్లీకి ఇది 74 ఇంటర్నేషనల్ సెంచరీ. సచిన్ 100 సెంచరీలతో ఈ జాబితాలో ముందున్నాడు.
11 Jan 2023
క్రికెట్నిరాశతో ఉంటే ముందుకెళ్లలేం.. సెంచరీపై కోహ్లీ స్పందన
గౌహతి వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ అద్భుతమైన సెంచరీని చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 73 సెంచరీలు చేసిన పరుగుల వీరుడు..ఈ క్రమంలో పలు రికార్డులను అధిగమించాడు. మ్యాచ్ ముగిసిన తరువాత తన సెంచరీపై కోహ్లీ స్పందించాడు.
10 Jan 2023
క్రికెట్ఇక రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్లేనా..?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియా జట్టుకు అద్భుత విజయాలను అందించారు. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ నుంచి భారత జట్టులో అనేక ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.