LOADING...
Rohit-Kohli: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌ పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక ప్రకటన
రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌ పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక ప్రకటన

Rohit-Kohli: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌ పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2025
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై గత కొంతకాలంగా వెలువడుతున్న ఊహాగానాలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సూటిగా ఖండించారు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ వీరిద్దరికీ చివరి సిరీస్ కావొచ్చని వస్తున్న వార్తలు తప్పుడు సమాచారం అని ఆయన క్లారిటీ ఇచ్చారు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా ఆటగాళ్లపై ఆధారపడే విషయం అని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ జట్టులో ఉండటం మనకు ఎంతో ప్రాధాన్యం. వారు గొప్ప బ్యాటర్లు, వారి అనుభవం ఆస్ట్రేలియాను ఓడించడంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.

Details

కచ్చితంగా రాణిస్తారు

ఇది వారి చివరి సిరీస్ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆటగాళ్లు ఎప్పుడు రిటైర్ అవ్వాలో నిర్ణయం స్వయంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఇప్పుడు రోహిత్ శర్మకు 2027 ప్రపంచకప్ సమయంలో 40, కోహ్లీకి 39 ఏళ్లు నాకొస్తాయి. మరోవైపు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా రాణించడం, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు సత్తా చాటడం, సీనియర్ల భవిష్యత్తుపై చర్చలకు ఆరంభం ఇచ్చింది. ప్రస్తుతానికి రోహిత్, కోహ్లీ టెస్టులు, టీ20ల నుంచి వైదొలిగి కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు.

Details

అక్టోబర్ 19న వన్డే సిరీస్

అలాగే వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టును రాజీవ్ శుక్లా అభినందించారు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ విజయం చాలా ముఖ్యం. ఆస్ట్రేలియాలో పోటీ ఎప్పుడూ తీవ్రమైంది. ఈ విజయం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆస్ట్రేలియాలోనూ మనం తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం నాకుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభమవుతుంది.