Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. పూజ చేసుకుంటున్న హిందువులపై బాంబు దాడి
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. తాజాగా కోమిల్లా ప్రాంతంలో శనివారం జరిగిన ఘటన మరొక ఉదంతంగా రికార్డు అయింది. పూజా నిర్వహణలో ఉన్న హిందువుల బృందంపై గుర్తు తెలియని దుండగులు బాంబులు విసిరారు. దీంతో భయభ్రాంతికి గురైన ప్రజలు పరుగులు పెట్టారు. స్థానిక మీడియా వర్గాల ప్రకారం, ఈ దాడిలో పలు వ్యక్తులు గాయపడ్డారు. పూజా కార్యక్రమానికి హాజరైన పూజారి 'కేశవ్ చక్రవర్తి' పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Details
గతంలో కూడా దాడులు
ఈ హింసాత్మక దాడులు, బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత దేశంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల జరుగుతున్నాయని వర్గాలు చెబుతున్నాయి. అప్పటినుంచి హిందువులపై జరుగుతున్న దాడులలో ఇప్పటివరకు పదుల సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోయారు.