IND vs NZ : టీ20 ప్రపంచకప్ విజేతగా టీమిండియా
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడిస్తూ భారత్ మూడవసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో మూడోసారి ట్రోఫీ కైవసం జట్టుగా భారత జట్టు సంచలన చరిత్రను తన పేరిట లిఖించుకుంది. గతంలో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ నేతృత్వంలో ట్రోఫీలు రాగా, ఈసారి కప్‌ను సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజు శాంసన్ (89), ఇషాన్ కిషన్ (54), అభిషేక్ శర్మ (52) హాఫ్ సెంచరీలతో తన వంతు పుంజుకున్నారు.
Details
నాలుగు వికెట్లతో చెలరేగిన బుమ్రా
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 19 ఓవర్లలోనే 159 పరుగులకే ఆ జట్టు ఆలౌటైంది. టిమ్ సీఫెర్ట్ (52), మిచెల్ శాంట్నర్ (43) రాణించగా, మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. టీమిండియా బౌలర్లలో జస్పిత్ బుమ్రా 4, అక్షర్ పటేల్ 3 వికెట్ల తీసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
96 పరుగుల తేడాతో టీమిండియా విజయం
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒 🇮🇳#TeamIndia clinch a record 3️⃣rd ICC Men's #T20WorldCup title 🏆
— BCCI (@BCCI) March 8, 2026
Take. A. Bow 🫡#MenInBlue | #Final | #INDvNZ pic.twitter.com/nml1AZY5tK