టాలీవుడ్: వార్తలు

20 Mar 2023

సినిమా

అవార్డుల వేట మొదలెట్టిన కార్తికేయ 2, బెస్ట్ యాక్టర్ తో మొదలు

యంగ్ యాక్టర్ హీరో నిఖిల్, గత సంవత్సరం రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి వందకోట్ల క్లబ్ లో చేరాడు.

నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్ విడుదల

నాగ చైతన్య తెరపై తెలుగు-తమిళం ద్విభాషా చిత్రం కస్టడీలో కనిపించనున్నారు. మానాడుతో శింబుకి అద్భుతమైన హిట్ ఇచ్చిన వెంకట్ ప్రభు పోలీస్ నేపధ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

'మంచుకొండల్లోన..' నుండి 'నాటు నాటు..' వరకు చంద్రబోస్ ప్రయాణం

తన పాటతో ప్రపంచ వేదికపై ఉర్రూతలూగించి, తెలుగు ఖ్యాతిని ప్రపంచాన్ని తెలియచేసిన పాటల రచయత చంద్రబోస్ ప్రయాణం 1995లో వచ్చిన "తాజ్ మహాల్" సినిమా నుండి మొదలైంది.

కేజీఎఫ్ కాంట్రవర్సీ: నవ్విన దర్శకులందరికీ తన మాటలతో పంచ్ ఇచ్చిన నాని

కేజీఎఫ్ సినిమా మీద అనేక కామెంట్లు చేసిన వెంకటేష్ మహా మీద సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సినిమాలోని క్యారెక్టర్ గురించి వెంకటేష్ మహా మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న ఇంద్రగంటి మోహనకృష్ణ, నందినీ రెడ్డి, వివేక్ ఆత్రేయ విరగబడి నవ్వారు.

వైరల్ వీడియో: ఇండోర్ క్రికెట్ మైదానంలో తగ్గేదేలే అంటూ కనిపించిన ఆస్ట్రేలియా కుర్రాడు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. పుష్ప లోని తగ్గేదేలే డైలాగ్ ప్రపంచ మంతా పాకిపోయింది. బాలీవుడ్ సెలెబ్రిటీల నుండి మొదలుపెడితే అంతర్జాతీయ క్రికెటర్ల వరకూ తగ్గేదేలే మ్యానరిజాన్ని చూపించారు.

03 Mar 2023

సినిమా

మంచు మనోజ్ మ్యారేజ్: పెళ్ళి కూతురును పరిచయం చేసిన హీరో

ఎట్టకేలకు మంచు మనోజ్ పెళ్ళికి సిద్ధమయ్యాడు. భూమా మౌనిక రెడ్డిని ఈరోజు వివాహం చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన అభిమానులకు పెళ్ళికూతురు భూమా మౌనికను పరిచయం చేసాడు మనోజ్.

27 Feb 2023

సినిమా

రేపు విడుదల కానున్న సామజవరగమన ఫస్ట్ లుక్

నటుడు శ్రీ విష్ణు గత చిత్రం అల్లూరి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు సామజవరగమన అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల

ఈమధ్య హీరోల పుట్టినరోజు సంధర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలు విడుదల చేయడం ట్రెండ్ గా మారింది. అలాగే ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు.

25 Feb 2023

సినిమా

'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది

ధనుష్ తాజా సినిమా సార్ (తమిళంలో వాతి) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలపై తీసిన సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాతి/సార్, రూ. 75కోట్లు కలెక్షన్స్ సాధించి విజయవంతంగా విదేశాలలో కూడా ఆడుతుంది.

25 Feb 2023

ఓటిటి

"నిజం విత్ స్మిత " షో లో నాని వారసత్వంపై చేసిన కామెంట్స్ వైరల్

నేచురల్ స్టార్ నాని, హీరో రానా దగ్గుబాటితో నిజం విత్ స్మిత షో పాల్గొన్నారు. ఈ మధ్యే నటుడి ఎపిసోడ్ ప్రోమోను ఓటీటీ ప్లాట్‌ఫాం సోనిలివ్ లో విడుదల చేశారు. ఆ షోలో, నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, వీటిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు.

22 Feb 2023

సినిమా

డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా చేసిన ప్రభు కు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

చంద్రముఖి, శక్తి, డార్లింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ నటుడు ప్రభు, గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు కొడంబక్కల్ లోని మెడ్ వే హాస్పిటల్ కు చేర్చారు.

21 Feb 2023

సినిమా

నందమూరి తారకరత్న బర్త్ డే: మరణించిన నాలుగు రోజులకే పుట్టుక

నందమూరి తారకరత్న మరణం సినిమా అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురై, ఆ తర్వాత 20రోజులకు పైగా మృత్యువుతో పోరాడి చివరకు మృత్యువు చేతిలో ఓడిపోయారు తారకరత్న.

20 Feb 2023

సినిమా

అనుష్క లుక్ చూసి అయోమయంలో అభిమానులు

అనుష్క శెట్టి.. టాలీవుడ్ కి పరిచయమై 15ఏళ్ళకు పైనే అయ్యింది. అయినా కూడా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. సాధారణంగా హీరోయిన్లకు అంత పెద్ద కెరీర్ ఉండదు.

03 Feb 2023

సినిమా

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం: కళాతపస్వి కే విశ్వనాథ్ కన్నుమూత

శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, స్వాతిముత్యం చిత్రాల దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్, గురువారం అర్థరాత్రి హైదరాబాద్ లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

ఆస్కార్ ఫలితాల కంటే ముందు మరోసారి థియేటర్లలోకి రానున్న ఆర్ఆర్ఆర్?

95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చ్ 12వ తేదీన హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. ఈసారి ఇండియా నుండి ఆస్కార్ అవార్డులకు మూడు నామినేషన్లు దక్కాయి.

మెగా హీరో వరుణ్ తేజ్ ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు

టాలీవుడ్ లో వరుస పెళ్ళిళ్ల పర్వం మరోసారి ఊపందుకోనుంది. అప్పట్లో కరోనా టైమ్ లో వరుసపెట్టి పెళ్ళిళ్ళు జరిగాయి. మరికొద్ది రోజుల్లో అదే తీరు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

వీరసింహారెడ్డి: హైదరాబాద్ లో బాలయ్య సినిమాకు వీరలెవెల్లో బుకింగ్స్, రికార్డుల మోత

ఒకరోజు తెల్లవారితే వీరసింహారెడ్డి సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుంది. బాలయ్య నటించిన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

వాలేరు వీరయ్య: రిలీజ్ కి ముందు క్రేజీ సాంగ్ రిలీజ్, శృతి అందాలు అదరహో

వాల్తేరు వీరయ్య సినిమా నుండి క్రేజీ సాంగ్ బయటకు వచ్చింది. నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువా అంటూ సాగే పాట ఆద్యంతం అద్భుతంగా ఉంది.

యూఎస్ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ లో టాప్ లో వీరసింహారెడ్డి

సంక్రాంతి సందర్భంగా థియేటర్లను షేక్ చేయడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి. తెలుగులో బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదల అవుతున్నాయి.

ఇంటివాడు కాబోతున్న హీరో శర్వానంద్, ఎంగేజ్ మెంట్ ఎప్పుడంటే

టాలీవుడ్ లో పెళ్ళి బాజాలు వరుసగా వినిపించనున్నాయి. యంగ్ హీరోలు అందరూ ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలెక్కబోతున్నారు. మొన్నటికి మొన్న నాగశౌర్య వివాహం జరిగింది.

తెలుగు సినిమా: ఉస్తాద్ రామ్ తో ధమాకా శ్రీలీల రొమాన్స్ షురూ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఉస్తాద్ రామ్ గా మారిపోయాడు. ఐతే ఇస్మార్ట్ విజయం తర్వాత రామ్ ఖాతాలో మరో విజయం చేరలేదు.

ఆర్ఆర్ఆర్: ఆస్కార్ పొందే అవకాశం ఉన్న జాబితాలో ఎన్టీఆర్ పేరు

ప్రపంచ సినిమా అవార్డ్స్ అన్నింటిలో ఆస్కార్ స్థానం ప్రత్యేకం. ఏ దేశ కళాకారులైనా ఒక్కసారైనా ఆస్కార్ అందుకోవాలని ఆశపడుతుంటారు. ఆస్కార్ కోసమే సినిమాలు చేస్తుంటారు కూడా.

ఫిబ్రవరిలో తెలుగు తెర మీద చిన్న సినిమాల సందడి

తెలుగు బాక్సఫీసు వద్ద సంక్రాంతి సందడి వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతీ ఒక్కరూ తమ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటారు.

04 Jan 2023

సినిమా

నిర్మాత సురేష్ బాబుపై ప్రశంసల వర్షం.. ట్రాఫిక్ క్లియరెన్స్ వీడియో వైరల్

గొప్పవాళ్ళు కావడానికి పెద్ద పనులే చేయాల్సిన అవసరం లేదు. నిజానికి చిన్న చిన్న పనులను కూడా బాధ్యాతయుతంగా చేస్తారు కాబట్టే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ప్రస్తుతం హైదరాబాద్ ఫిలిమ్ నగర్ లో జరిగిన ఒక సంఘటన పై వాక్యాన్ని నిజం చేస్తోంది.

ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ.. త్వరలోనే ప్రకటన

ఎన్టీఆర్30 సినిమా నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు అందరూ ఆశగా ఎదురుచూసారు. రిలీజ్ డేట్ ప్రకటనతో ఆ ఆశ కొంత తీరినప్పటికీ, హీరోయిన్ ఎవరనే విషయం మీద అంతా ఆసక్తిగా ఉన్నారు.

అవెంజర్ యాక్టర్ కి యాక్సిడెంట్.. పరిస్థితి విషమం

మార్వెల్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మార్వెల్ నుండి ఏ సినిమా వచ్చినా ఎగబడి చూసేస్తుంటారు. దానివల్ల మార్వెల్ సినిమాల్లో నటించే వాళ్ళకు కూడా ప్రపంచ మొత్తం అభిమానులు ఏర్పడ్డారు.

ఫలానా అమ్మాయి ప్రేమలో నాగశౌర్య.. కొత్త సినిమా ప్రకటన

క్రిష్ణ వ్రింద విహారి సినిమా తర్వాత నాగశౌర్య తన కొత్త సినిమాను ప్రకటించాడు. "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది.

వాల్తేరు వీరయ్య: మేకింగ్ వీడియోలో చిరంజీవి నుండి మరో లీక్

సంక్రాంతి సందర్భంగా థియేటర్ల వద్ద రచ్చ చేయడానికి వాల్తేరు వీరయ్య రెడీ అవుతున్నాడు. ప్రమోషన్ల జోరు చూస్తుంటే ఈ విషయం తెలిసిపోతుంది. మరికొద్ది రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో చివరి పాటను కూడా వదిలే పనిలో ఉన్నారు.

2022: తెలుగు తెరకు పరిచయమైన డబ్బింగ్ హీరోలు.. మొదటి స్థానంలో ఎవరున్నారంటే

సినిమాలోని ఏదైనా అంశానికి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయితే ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని మోస్తారు. అందులో హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎవరన్న సంగతి వాళ్ళు పట్టించుకోరు.

అల్లు అరవింద్ భారీ ఆఫర్.. ఆ సినిమాల్లో హీరో నిఖిల్ కి షేర్

2022సంవత్సరం హీరో నిఖిల్ కి బాగా కలిసొచ్చింది. ఆగస్టులో కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో విజయం అందుకుని, చివర్లో 18 పేజెస్ తో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

కొత్త సంవత్సరంలో ఏం చేయాలో చెబుతూ సమంత ఎమోషనల్ పోస్ట్

స్టార్ హీరోయిన్ సమంత, యశోద సినిమా విడుదల సమయంలో తన అనారోగ్యం గురించి అందరి ముందు బయటపెట్టింది. ఆటో ఇమ్యూన్ వ్యాధిరకమైన మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది సమంత.

జీ2 ని రెడీ చేస్తున్న అడవి శేష్.. డేట్ ఫిక్స్

అడవి శేష్.. క్షణం సినిమా నుండి మొన్న వచ్చిన హిట్ 2 వరకు అన్నింట్లోనూ విజయం అందుకున్నాడు. ఈ మధ్య తెలుగు సినిమాకి ఇన్ని హిట్లు అందించిన హీరో కనబడలేదు.

వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది

గాడ్ ఫాదర్ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

గ్యాంగ్ లీడర్ తో పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత నటుడు వల్లభనేని జనార్ధన్ ఇక లేరు

చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ సుమలతకు తండ్రి పాత్రలో మెప్పించిన నటుడు వల్లభనేని జనార్ధన్, ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు.

నాగ చైతన్య కస్టడీ

తెలుగు సినిమా

వేసవిలో వస్తున్న నాగచైతన్య కస్టడీ.. విడుదల తేదీ ప్రకటన

థ్యాంక్యూ సినిమాతో అతిపెద్ద అపజయాన్ని మూటగట్టుకున్న అక్కినేని వారసుడు నాగ చైతన్య, ప్రస్తుత్రం ద్విభాషా చిత్రం కస్టడీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా నుండి నాగ చైతన్య పుట్టినరోజున ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది.

బాహుబలిని ఫాలో అవుతున్న పొన్నియన్ సెల్వన్.. రెండో భాగం విడుదల తేదీ ప్రకటన

బాహుబలి సినిమాతో దేశంలో పెద్ద సంచలనం చెలరేగింది. పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా వర్కౌట్ అవుతాయని చూపించిన సినిమా అది. అందుకే అప్పటి నుండి అన్ని ఇండస్ట్రీల్లోనూ అలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఇడియట్ 2 సీక్వెల్ పై ఆన్సర్ చేసిన మాస్ మహారాజా రవితేజ

ఇడియట్.. రవితేజ కెరీర్ ని పూర్తిగా మలుపు తిప్పిన సినిమా ఇది. అప్పటివరకు వెండితెర మీద ఎన్నో సినిమాల్లో కనిపించినప్పటికీ ఇడియట్ సినిమాతోనే హీరోగా నిలదొక్కుకున్నాడు రవితేజ.

2022లో తెలుగు తెరకు పరిచయమైన హీరోలు, హీరోయిన్లు

తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్ ని ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సంవత్సరం తెలుగు తెరమీద చాలామంది కొత్తవాళ్ళు కనిపించారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంలో ఈ సంవత్సరం కొత్తగా మెరిసిన వారి గురించి తెలుసుకుందాం.

సోషల్ మీడియా సాక్షిగా థ్యాంక్స్ చెప్పిన ఉపాసన

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. ఈ విషయమై అభిమానులు అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.