LOADING...
Nagarjuna : నాగార్జున 100వ సినిమా.. టబు ఎంట్రీతో అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
టబు ఎంట్రీతో అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

Nagarjuna : నాగార్జున 100వ సినిమా.. టబు ఎంట్రీతో అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున తన కెరీర్‌లో 100వ చిత్రాన్ని అత్యంత ప్రత్యేకంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా,దీనికి 'కింగ్ 100' లేదా 'లాటరీ కింగ్' వంటి టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా,ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా ఎవరు ఊహించని విధంగా సీనియర్ నటి టబు కనిపించబోతున్నారన్న వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాగార్జున-టబు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. గతంలో 'నిన్నే పెళ్లాడుతా','ఆవిడ మా ఆవిడే' వంటి చిత్రాలతో ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు 27ఏళ్ల విరామం తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటించనున్నారన్న వార్త అక్కినేని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

వివరాలు 

గెస్ట్ రోల్స్‌లో నాగచైతన్య,అఖిల్

తాజా సమాచారం ప్రకారం, నాగార్జున 100వసినిమా గురించి తెలిసిన టబు..ఆ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌లో తనకు కూడా ఓ పాత్ర ఉండాలని ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. దీంతో దర్శకుడు రా కార్తీక్ ఆమె కోసం ఓ బలమైన,కీలకమైన పాత్రను ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. ఈసినిమాలో టబుతో పాటు నాగచైతన్య,అఖిల్ కూడా ముఖ్యమైన పాత్రల్లో లేదా గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారని టాక్. 'మనం'చిత్రం తర్వాత అక్కినేని కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలు ఒకే తెరపై దర్శనం ఇవ్వనున్న అవకాశం ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని 2026 మే నెలలో సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.

Advertisement