LOADING...
Dacoit Movie: ధురంధర్ 2' ఎఫెక్ట్.. ఉగాది రేస్ నుంచి తప్పుకున్న 'డెకాయిట్'?
ధురంధర్ 2' ఎఫెక్ట్.. ఉగాది రేస్ నుంచి తప్పుకున్న 'డెకాయిట్'?

Dacoit Movie: ధురంధర్ 2' ఎఫెక్ట్.. ఉగాది రేస్ నుంచి తప్పుకున్న 'డెకాయిట్'?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2026
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యువ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ' వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన వాయిదా వార్తలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. వాస్తవానికి ఈ సినిమాను మార్చి 19న ఉగాది కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే అదే సమయంలో బాలీవుడ్‌లో రణవీర్ సింగ్ నటిస్తున్న భారీ చిత్రం 'ధురంధర్ 2', అలాగే కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' కూడా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ మూడు భారీ ప్రాజెక్టులు ఒకేసారి విడుదలకావడంతో బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Details

ఏప్రిల్ 10కి వాయిదా

ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్ల లభ్యత, కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో 'డెకాయిట్' యూనిట్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిత్రాన్ని ఏప్రిల్ 10, 2026కు వాయిదా వేయాలనే ఆలోచనలో నిర్మాతలున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఈ బాక్సాఫీస్ క్లాష్‌పై అడివి శేష్ స్పందిస్తూ, పెద్ద సినిమాల మధ్య తమ సినిమా ఒక 'గోల్డ్ ఫిష్' లాంటిదని ధీమా వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సోలో రిలీజ్‌నే బెస్ట్ ఆప్షన్ అని టీమ్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 'డెకాయిట్' విడుదల తేదీపై అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement