LOADING...
OTT: బోలెడన్ని ట్విస్టులు.. నిరాశపరచదు.. రాజీవ్ కనకాల కాన్ఫిడెంట్ కామెంట్స్
బోలెడన్ని ట్విస్టులు.. నిరాశపరచదు.. రాజీవ్ కనకాల కాన్ఫిడెంట్ కామెంట్స్

OTT: బోలెడన్ని ట్విస్టులు.. నిరాశపరచదు.. రాజీవ్ కనకాల కాన్ఫిడెంట్ కామెంట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరో తెలుగు ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు పేరుతో రూపొందిన ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయ భాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు. 'రెక్కీ', 'విరాటపాలెం' తర్వాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్‌పై కేవీ శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కు కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ జానర్‌లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్‌కు ముందు మీడియా కోసం రెండు ఎపిసోడ్‌లను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం జరిగిన గ్రాండ్ ప్రీవ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Details

ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుంది

రాజీవ్ కనకాల మాట్లాడుతూ, "'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' సిరీస్‌కు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. నేను ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రలు పోషించాను. అయితే ఈ సిరీస్‌లో చేసిన పాత్ర మాత్రం నా కెరీర్‌లో మైల్‌స్టోన్‌లా నిలుస్తుందని తెలిపారు. ఈ సిరీస్‌లో నా మాడ్యులేషన్, పాత్ర తీరు, డైలాగ్ డెలివరీ అన్నీ కొత్తగా ఉంటాయి. దర్శకుడు కృష్ణ నన్ను పూర్తిగా భిన్నంగా చూపించారు. నా స్నేహితుడు శ్రీరామ్ నిర్మాణంలో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన జయంత్ గారు, అనురాధా గారికి కృతజ్ఞతలని అన్నారు.

Details

ఈ సిరీస్ కు బ్లాక్ బస్టర్ అవుతుంది

ఫిబ్రవరి 27న స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశపరచదని, అనేక ట్విస్టులు ఉంటాయని రాజీవ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఉదయ భాను గారితో నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ హిట్ అయింది. ఈ సిరీస్ కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. నిర్మాత కేవీ శ్రీరామ్ మాట్లాడుతూ, "జీ5 ఓటీటీ సంస్థలో జయంత్ గారు, అనురాధా మేడం ఇచ్చే సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. రాజీవ్ కనకాల నా స్నేహితుడు. కానీ ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు రాజీవ్ కాదు, ప్రసాద్ రావే కనిపించాడు. ఆయన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయారని అన్నారు. ఉదయ భాను నా మంచి స్నేహితురాలు. ఆమె పాత్ర కూడా ఎంతో బాగుంటుంది.

Advertisement

Details

ఫిబ్రవరి 27న స్ట్రీమింగ్

నా నిర్మాణంలో నా స్నేహితులకు మంచి పాత్రలు ఇవ్వగలిగాననే సంతృప్తి ఉంది. ప్రతి తండ్రికి కనెక్ట్ అయ్యే కథ ఇది. ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్‌లా ఉంటుంది. చివరి వరకు థ్రిల్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 27న ZEE5లో 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' విడుదల కానుందని, ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుందని నిర్మాత కేవీ శ్రీరామ్ ప్రేక్షకులను చూడాలని కోరారు.

Advertisement