Band Melam: లవ్ ఫెయిల్ యువకుడి కథ.. 'బ్యాండ్ మేళం' గ్లింప్స్ విడుదల
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 14, 2026
05:10 pm
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న సినిమాగా 'కోర్ట్' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్యాండ్ మేళం' (Band Melam) విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కింది. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో లవ్ ఫెయిల్ అయిన యువకుడి భావోద్వేగాలను చూపిస్తూనే, చివరిలో హీరో తన స్నేహితుడికి తాళి కట్టడం చూపిస్తూ హాస్యభరితమైన సన్నివేశాన్ని అందించారు. ఈ మూవీ మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.