Tollywood: 'ఇద్దరు మిత్రులు'లో ఏఎన్‌ఆర్‌కు డూప్ ఎవరో తెలుసా? ఆశ్చర్యపోయే నిజం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో 'ఇద్దరు మిత్రులు' ఒకటి. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు. అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం బెంగాలీ హిట్ 'తాషేర్ ఘర్' ఆధారంగా రూపొందింది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, నిర్మాత దుక్కిపాటి మధుసూధన రావు, సహాయ దర్శకుడు కె. విశ్వనాథ్, జర్నలిస్ట్ గోరా శాస్త్రిల బృందం మూల కథలోని కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని, పూర్తి స్థాయి కొత్త కథను అభివృద్ధి చేశారు. సంభాషణలను డాక్టర్ కొర్రిపాటి గంగాధర రావు అందించారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో రాజసులోచన, E. V. సరోజ హీరోయిన్లుగా నటించారు.
Details
ఒకే పొలికతో ఇద్దరు వ్యక్తులు
అలాగే శారద కోసం ప్రత్యేకంగా ఓ పాత్రను సృష్టించారు. గుమ్మడి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నారు. 1961 డిసెంబరు 29న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయంలో ఏఎన్‌ఆర్ ప్రదర్శనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సాధారణంగా ద్విపాత్రాభినయం అంటే అన్నదమ్ముల కథగా భావిస్తారు. కానీ 'ఇద్దరు మిత్రులు' చిత్రంలో ఇద్దరు హీరోలకు ఎటువంటి రక్తసంబంధం ఉండదు. కేవలం ఒకే పోలికలతో ఉండే వ్యక్తులుగా చూపించారు. బెంగాలీ వెర్షన్‌లో ఉత్తమ్ కుమార్‌కు ఆయన తమ్ముడు పరున్ కుమార్ డూప్‌గా నటించగా, తెలుగులో అక్కినేని నాగేశ్వరరావుకు జగన్నాథరావు అనే కళాకారుడు డూప్‌గా నటించారు.
Details
మద్రాసులో షూటింగ్
మసక వెలుతురులో ఆయన అచ్చం అక్కినేనిలా కనిపించేవారట. సినిమాటోగ్రాఫర్ సెల్వరాజ్ అప్పటి పరిమిత సాంకేతిక సౌకర్యాలతోనే ద్విపాత్రాభినయ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్ర షూటింగ్ ప్రధానంగా మద్రాసులో జరిగింది. మ్యాచింగ్ సన్నివేశాలను హైదరాబాద్‌లో తెరకెక్కించారు. ఆ కాలంలో ఈ చిత్రం నిర్మాణం పెద్ద సంచలనంగా మారింది. ముఖ్యంగా ద్విపాత్రాభినయ సన్నివేశాలను ఎలా చిత్రీకరిస్తున్నారన్న ఆసక్తి సినీ వర్గాల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా నిలిచింది.