Araku Coffee: అరకు కాఫీకి గౌరవం .. ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ ఇచ్చిన బాక్స్‌లో చోటు
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు ప్రత్యేకంగా రూపొందించిన 'కాఫీ ఆఫ్ ఇండియా' బాక్స్‌ను కానుకగా అందించారు. దేశంలోని అత్యుత్తమ కాఫీ రకాలతో సిద్ధం చేసిన ఈ ప్రీమియం బాక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రసిద్ధ అరకు కాఫీకి కూడా చోటు కల్పించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రీమియం కాఫీ ఎంపికలో అరకు కాఫీని చేర్చడం ద్వారా రాష్ట్రానికి, ముఖ్యంగా గిరిజన రైతులకు గౌరవం దక్కిందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
'కాఫీ ఆఫ్ ఇండియా' బాక్స్ దేశ కాఫీ నాణ్యతకు ప్రతీక
ప్రధాని మోదీ ఆంథోనీ అల్బనీస్‌కు అందించిన 'కాఫీ ఆఫ్ ఇండియా' బాక్స్‌కు సంబంధించిన చిత్రాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన భారత కాఫీ విశిష్టతను వివరించారు.
భారత్‌లోని విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో పండే కాఫీ గింజలు ప్రత్యేకమైన ప్రాసెసింగ్ విధానాల ద్వారా ప్రత్యేక రుచి, సువాసనలను సంతరించుకుంటాయని పీయూష్ గోయల్ తెలిపారు.
ప్రపంచస్థాయిలో కాఫీ ఉత్పత్తిదారుగా భారత్ వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో, 'కాఫీ ఆఫ్ ఇండియా' బాక్స్ దేశ కాఫీ నాణ్యతకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
ధన్యవాదాలు తెలిపిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
ఈ ప్రీమియం కాఫీ బాక్స్‌లో అరకు కాఫీకి చోటు దక్కడం పట్ల లావు శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో పండించే అరకు కాఫీకి ఈ గుర్తింపు లభించడం అక్కడి గిరిజన రైతుల శ్రమకు దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీకి మరింత గుర్తింపు తీసుకురావడంలో ఇది కీలక అడుగుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పీయూష్ గోయెల్ చేసిన ట్వీట్
India's coffee craft in a box! 🇮🇳
— Piyush Goyal (@PiyushGoyal) July 12, 2026
PM @NarendraModi ji gifted Australian PM @AlboMP with the Indian Premium Coffee Box, celebrating India's rich coffee heritage that captures unique flavours shaped by our diverse terrains and distinct processes.
This gift reflects India's… pic.twitter.com/7tWRDkU4Yf