Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. ఉత్తమ నటిగా నివేదా థామస్
ఈ వార్తాకథనం ఏంటి
కొచ్చి వేదికగా 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ప్రదానోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని మెరుపులు మెరిపించారు. 2024లో విడుదలైన చిత్రాలకు గాను అవార్డులు ప్రదానం చేశారు. ఈసారి ఎక్కువ పురస్కారాలు పుష్ప-2 సినిమాకే దక్కడం విశేషం. ఈ చిత్రంలో నటించిన అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా, '35: చిన్నకథ కాదు' చిత్రానికి గాను నివేతా థామస్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. 'పుష్ప 2' చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఇదే చిత్రం ఉత్తమ చిత్రం, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగాల్లోనూ విజేతగా నిలిచింది.
Details
ఉత్తమ సహాయ నటిగా అంజలి
ఇక కల్కి చిత్రానికి గాను అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటించిన అంజలి ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నారు. పరిచయ విభాగాల్లో 'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి గాను యాదు వంశీ ఉత్తమ పరిచయ దర్శకుడిగా, సందీప్ సరోజ్ ఉత్తమ పరిచయ నటుడిగా ఎంపికయ్యారు. 'గం గం గణేశా' చిత్రంతో నయన్ సారిక ఉత్తమ పరిచయ నటి అవార్డు అందుకున్నారు. సంగీత విభాగంలో 'దేవర' చిత్రంలోని 'చుట్టమల్లె చుట్టేస్తోంది' పాటకు గాను రామజోగయ్య శాస్త్రీ ఉత్తమ సాహిత్య అవార్డు దక్కించుకున్నారు.
Details
ఫిల్మ్‌ఫేర్ వేడుకలో 'పుష్ప 2' ఆధిపత్యం
'గుంటూరు కారం' చిత్రంలోని 'కుర్చీ మడతపెట్టి' పాటకు గాను శ్రీకృష్ణ ఉత్తమ గాయకుడిగా, అదే 'చుట్టమల్లె' పాటకు శిల్ప రావు ఉత్తమ గాయని అవార్డు అందుకున్నారు. ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో నితిన్ జిహానీ చౌదరి ('కల్కి 2898 ఏడీ')తో పాటు రామకృష్ణ-మోనిక ('పుష్ప 2') విజేతలుగా నిలిచారు. 'కుర్చీ మడతపెట్టి' పాటకు శేఖర్ మాస్టర్ బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు అందుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో 'లక్కీ భాస్కర్' ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, తేజ సజ్జా ఉత్తమ నటుడిగా నిలిచారు. 'సత్యభామ' చిత్రానికి గాను కాజల్ అగర్వాల్ ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డు అందుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ వేడుకలో 'పుష్ప 2' ఆధిపత్యం చాటగా, టాలీవుడ్‌కు పలు విభాగాల్లో గౌరవం దక్కింది.