Nagabandham : శివరాత్రి కానుకగా 'నాగబంధం' టీజర్ విడుదల.. విజువల్ ట్రీట్ అంటూ ప్రశంసలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 15, 2026
12:13 pm
ఈ వార్తాకథనం ఏంటి
దైవిక అంశాలతో భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రాల్లో 'నాగబంధం' (Nagabandham) ఒకటి. 'పెదకాపు' ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా, చిత్రాన్ని అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నభా నటేశ్, ఐశ్వర్యా మేనన్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ హీరో మహేశ్ బాబు సోషల్ మీడియాలో 'నాగబంధం' టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ఎంతో ఆకట్టుకుందని పేర్కొంటూ, సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపారు. పురాతన రహస్యాలు, 'నాగబంధం' సాంప్రదాయంతో అనుసంధానమైన కథా నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విశేష విజువల్ ఎఫెక్ట్స్‌తో భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.