LOADING...
Keerthy Suresh: వెంకటేష్‌తో కీర్తి సురేష్ జోడి.. అనిల్ రావిపూడి మాస్ ప్రాజెక్ట్!
వెంకటేష్‌తో కీర్తి సురేష్ జోడి.. అనిల్ రావిపూడి మాస్ ప్రాజెక్ట్!

Keerthy Suresh: వెంకటేష్‌తో కీర్తి సురేష్ జోడి.. అనిల్ రావిపూడి మాస్ ప్రాజెక్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2026
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ - హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి జంట మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధుల చేయడానికి సిద్ధమవుతోంది. గతంలో ఈ జంట F2, F3 వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను సృష్టించింది. ఇప్పుడు వీరిద్దరూ తమ తదుపరి ప్రాజెక్ట్‌పై పనులు ప్రారంభించబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో కజిత్తుగా ప్రచారం జరుగుతోంది. సమాచారం ప్రకారం, ఈ సినిమా జూలై 2026 నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశముందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా మహానటి కీర్తి సురేష్ ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలుగా బయటికొచ్చింది. అలాగే ఒక కీలక పాత్రలో మలయాళ్ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ కనిపిస్తారని వినికిడి ఉంది.

Details

అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు

ఫహద్ ఫాసిల్ - వెంకీ మామా మధ్య సంభవించే సన్నివేషాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ఇప్పటివరకు చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. అయితే, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావచ్చనే టాక్ వినపడుతోంది. ఈ సినిమాను అనిల్ రావిపూడి సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పక్కా ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో 'ఆదర్శ కుటుంబం - AK 47' మూవీ చేస్తున్నట్లు సమాచారం.

Details

వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్

అది పూర్తైన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని వర్గాలు వెల్లడించాయి. సంక్రాంతి సెంటిమెంట్‌ను బ్రేక్ చేయకుండా 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి అనిల్ రావిపూడి జోరుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని టాక్ నడుస్తోంది.

Advertisement