LOADING...
Mokshagna : నందమూరి వారసుడి అరంగేట్రం ఖాయం.. క్రిష్ దర్శకత్వంలో మెగా ప్రాజెక్ట్
నందమూరి వారసుడి అరంగేట్రం ఖాయం.. క్రిష్ దర్శకత్వంలో మెగా ప్రాజెక్ట్

Mokshagna : నందమూరి వారసుడి అరంగేట్రం ఖాయం.. క్రిష్ దర్శకత్వంలో మెగా ప్రాజెక్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ కి నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. నందమూరి మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్న తొలి చిత్రం 'ఆదిత్య 999 మ్యాక్స్'. ఇది 1991లో విడుదలై తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369కు సీక్వెల్‌గా రూపొందనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారు. 'ఆదిత్య 369'అప్పట్లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సంచలనం సృష్టించగా, ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న 'ఆదిత్య 999 మ్యాక్స్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఈ చిత్రం హాట్ టాపిక్‌గా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.

Details

ఐదు, ఆరు స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి

ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. మార్చి నెలలో అధికారికంగా చిత్రాన్ని ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ సెట్స్, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో బలమైన నటీనటులను ఎంపిక చేసే పనిలో యూనిట్ నిమగ్నమైందని తెలుస్తోంది. ముఖ్యంగా మోక్షజ్ఞ లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. ఆయనను స్టైలిష్, మాడర్న్ అవతార్‌లో ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల తన కుమారుడి ఎంట్రీపై స్పందించిన నందమూరి బాలకృష్ణ, "మోక్షజ్ఞను ఎలా పరిచయం చేయాలో నాకు తెలుసు. అతని కోసం ఐదు ఆరు స్క్రిప్ట్స్ నా మైండ్‌లో రెడీగా ఉన్నాయంటూ ధీమా వ్యక్తం చేశారు.

Details

టాలీవుడ్ లో కొత్త అధ్యాయం ప్రారంభం

దీంతో ఈ ఎంట్రీ ప్రత్యేకంగా ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాకు సంభాషణలు ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా రాస్తున్నారు. ఆయన పదునైన డైలాగులు, భావోద్వేగాన్ని కలగలిపే రచన ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలం చేకూర్చనుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి, 'ఆదిత్య 999 మ్యాక్స్'తో నందమూరి మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో టాలీవుడ్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్నట్టే. ఈ భారీ ప్రాజెక్ట్ ఎలా రూపుదిద్దుకుంటుందో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.

Advertisement