Loading...
Swayambhu Teaser: 'స్వయంభు' టీజర్ అప్డేట్ వచ్చేసింది.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరో నిఖిల్
'స్వయంభు' టీజర్ అప్డేట్ వచ్చేసింది.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరో నిఖిల్

Swayambhu Teaser: 'స్వయంభు' టీజర్ అప్డేట్ వచ్చేసింది.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరో నిఖిల్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో ప్రతిభ ఉన్న హీరోల జాబితాలో నిఖిల్ సిద్ధార్థ్ పేరు ముందువరుసలో ఉంటుంది. ఆయన సినిమాలకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉందన్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభ దశలో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా,ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని తనకు సరిపోయే కథలను ఎంచుకుంటూ నిఖిల్ తనను తాను మార్చుకున్నారు. అలా క్రమంగా స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు. నిఖిల్ కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచిన 'కార్తికేయ 2' ఘన విజయం సాధించి,రూ.100కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల విరామం అనంతరం నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 'స్వయంభు'. పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.

వివరాలు 

ఆదివారం టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

రెండు సంవత్సరాలకు పైగా ఈ సినిమా షూటింగ్ కొనసాగింది.

మధ్యలో అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యం అయినప్పటికీ, చివరికి షూటింగ్‌ను పూర్తి చేశారు.

అయితే సినిమా విడుదల తేదీపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల ఆదివారం రోజున మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు.

ఇప్పటివరకు షూటింగ్ మాత్రమే సాగి, ఎలాంటి టీజర్ విడుదల కాకపోయిన 'స్వయంభు' టీజర్‌ను ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా నిఖిల్ పవర్‌ఫుల్ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. చేతిలో కత్తి పట్టుకుని కనిపిస్తున్న నిఖిల్ రూపం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

వివరాలు 

ఇది మా రెండేళ్ల కష్టం: నిఖిల్

టీజర్ అప్డేట్‌తో పాటు నిఖిల్ ఒక భావోద్వేగ పోస్ట్‌ను కూడా షేర్ చేశారు.

"ఇది మా రెండేళ్ల కష్టం. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి చాలా శ్రమించాం. చివరికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది" అంటూ ఆయన రాసుకొచ్చారు.

ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'స్వయంభు' చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించగా, కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బాస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిఖిల్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT