Rana Daggubati: పాడ్‌కాస్ట్‌లో రానా సంచలన వ్యాఖ్యలు.. గుండె, కిడ్నీ సమస్యలపై ఓపెన్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో 'హల్క్'గా గుర్తింపు పొందిన హీరో రానా దగ్గుపాటి తన ఎత్తు, వ్యక్తిత్వంతో హాలీవుడ్ హీరోల సరసన నిలుస్తాడు. ముఖ్యంగా బహుబలి చిత్రాల్లో భల్లాలదేవ పాత్రలో ఆయన కనిపించిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. రానా కెరీర్‌లో 'బాహుబలి' ఓ ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. అయితే ఆ సినిమా తర్వాత ఆయన తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు స్వయంగా వెల్లడించాడు. 'బాహుబలి' కోసం దాదాపు నాలుగేళ్ల పాటు ఒకే రకమైన భారీ బరువును మైంటైన్ చేయడం చాలా కష్టమని రానా చెప్పాడు. తాజా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన, తనను ఎవరూ బలవంతంగా బాడీ పెంచమని అడగలేదని, కానీ ఇలాంటి మార్పులు చేయడం ఎంత కష్టమో తెలుసని పేర్కొన్నాడు.
Details
ఒక్కసారిగా సన్నబడ్డ రానా
సాధారణ ఆహారపు అలవాట్లతో అలా చేయడం సాధ్యం కాదని, ప్రత్యేక డైట్ అవసరమవుతుందని వివరించాడు. సినిమా పూర్తయ్యాక రానా ఒక్కసారిగా చాలా సన్నబడ్డాడు. ఆయన కొత్త లుక్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. రానాకు ఏమైందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'బాహుబలి' కోసం చేసిన వర్కవుట్స్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, విదేశాలకు వెళ్లి చికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో కిడ్నీ మార్పిడి జరిగిందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ అంశంపై రానా స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. అనారోగ్య కారణాల వల్ల 'బాహుబలి' తర్వాత కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని, ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్ చెక్కులు కూడా తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
Details
ప్రభాస్ మౌకాలికి సర్జరీ
దాదాపు మూడు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నానని రానా వెల్లడించాడు. ఇక 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కూడా మోకాలి సమస్యలతో బాధపడ్డాడు. చిన్న సర్జరీ చేయించుకోవాల్సి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. భారీగా బరువు పెంచి మళ్లీ తగ్గించడం శరీరానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇదే తరహాలో అమీర్ ఖాన్ కూడా దంగల్ సినిమా కోసం దాదాపు 97 కిలోల వరకు బరువు పెరిగి, రెండో పాత్ర కోసం సుమారు 20 కిలోలు తగ్గాడు. ఆ సమయంలో అది పెద్ద సెన్సేషన్‌గా మారింది. ఆ సినిమా కోసం ఆమిర్ ఖాన్ తన ఆరోగ్యాన్నే పణంగా పెట్టాడని చెప్పుకోవచ్చు.