Chandrahas: 'బరాబర్ ప్రేమిస్తా' ఈవెంట్ వివాదం.. చంద్రహాస్‌పై మాదాపూర్ పోలీసుల కేసు
ఈ వార్తాకథనం ఏంటి
బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడిగా సినీ రంగంలోకి వచ్చిన హీరో చంద్రహాస్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ వెల్లడించిన సమాచారం ప్రకారం, చంద్రహాస్ హీరోగా నటించిన 'బరాబర్ ప్రేమిస్తా' సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఇటీవల నగరంలో జరిగింది. ఆ వేడుకలో వేదికపైకి వచ్చిన చంద్రహాస్ అసభ్య పదజాలం ఉన్న పాటను పాడటంతో వివాదం మొదలైంది.
వివరాలు
జర్నలిస్టును బెదిరించేలా వీడియో
ఈ ఘటనపై బిగ్ టీవీలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న అశోక్‌కుమార్ స్పందిస్తూ, చంద్రహాస్ వాడిన భాష తగదని పేర్కొంటూ ఒక వీడియోను విడుదల చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రహాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జర్నలిస్టును బెదిరించేలా వీడియోను పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై అశోక్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.