Anil Ravipudi : అనిల్ రావిపూడి కొత్త సినిమా రూమర్లపై సెటైరికల్ ట్వీట్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. విక్టరీ వెంకటేష్, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్, ఆషిక రంగనాథ్ కలిసి నటించే చిత్రాన్ని ఆయన తెరకెక్కించబోతున్నారని వార్తలు తెగ హడావుడి చేశాయి. అంతేకాదు, నేడో రేపో ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందనే ప్రచారం జరిగింది. ఈ చిత్రానికి 'శ్రీమతి లత రెడ్డి' అనే టైటిల్ ఖరారైందని, నటీనటుల ఎంపిక కూడా పూర్తయిందని ఫిల్మ్‌నగర్‌లో జోరుగా వార్తలు వినిపించాయి. ఈ రూమర్లపై అనిల్ రావిపూడి తనదైన శైలిలో స్పందించారు.
వివరాలు
మీరే యాక్షన్…కట్ కూడా చెప్పేస్తారేమో!
ఈ ఊహాగానాలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన అనిల్ రావిపూడి,వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేశారు. "నేను ఇంకా కాగితం మీద కలం కూడా పెట్టలేదు. అప్పుడే కథ,నటీనటులు,టైటిల్ వరకు ఫిక్స్ చేసేశారు. ఇదే స్పీడ్ కొనసాగితే మీరే యాక్షన్...కట్ కూడా చెప్పేస్తారేమో!"అంటూ సెటైర్ వేశారు. తన పేరుతో వస్తున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టంచేశారు. తన తదుపరి సినిమా ఎవరితో, ఏ కథతో ఉండబోతుందన్న విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. "నేను చేయబోయే సినిమా ఏది,ఎవరితో అనేది పూర్తి నిజమైన వివరాలతో అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం" అని అభిమానులకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అనిల్ రావిపూడి చేసిన ట్వీట్
నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా 😭🙏
— Anil Ravipudi (@AnilRavipudi) February 10, 2026
నటినటులు
కధ
టైటిల్ కూడా
పెట్టేసారు
ఈ ఫ్లో చూస్తుంటే .యాక్షన్..కట్ కూడా చెప్పేస్తారేమో 😉😉😉😊😄
మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను....
అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో...నిజమైన
పూర్తి వివరాలు... మీకు… pic.twitter.com/bfhQ4NrOfu