LOADING...
Vishwambhara : 'విశ్వంభర' టీజర్‌పై విమర్శల ప్రభావం.. కీలక నిర్ణయం తీసుకున్న యూవీ క్రియేషన్స్
'విశ్వంభర' టీజర్‌పై విమర్శల ప్రభావం.. కీలక నిర్ణయం తీసుకున్న యూవీ క్రియేషన్స్

Vishwambhara : 'విశ్వంభర' టీజర్‌పై విమర్శల ప్రభావం.. కీలక నిర్ణయం తీసుకున్న యూవీ క్రియేషన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపించగానే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతాయి. ఆయన నటిస్తున్న ప్రతి సినిమా ఓ సంచలనంగా మారుతుంటుంది. ప్రస్తుతం చిరంజీవి యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'(Vishwambhara)పై భారీ స్థాయిలో హైప్ నెలకొంది. ఈ సినిమాలో చిరంజీవి గతంలో చేసిన క్లాసిక్ హిట్స్‌కు చెందిన షేడ్స్ కనిపించనున్నాయని సమాచారం. ముఖ్యంగా 'జగదేకవీరుడు అతిలోకసుందరి'లోని అద్భుతమైన ఫాంటసీ అంశాలు, వినోదం... అలాగే 'హిట్లర్' చిత్రంలో ప్రేక్షకులను కదిలించిన అన్న-చెల్లెళ్ల సెంటిమెంట్—ఈ రెండు భావోద్వేగాల మేళవింపు 'విశ్వంభర'లో హైలైట్‌గా నిలవనుందని టాక్. సృష్టి, స్థితి, లయ అనే తత్వాల చుట్టూ తిరిగే ఈ కథలో చిరంజీవి విశ్వంభరుడుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Details

మెగా అభిమానుల నుంచి కొంత అసంతృప్తి

అయితే ఇటీవల విడుదలైన టీజర్‌లోని గ్రాఫిక్స్‌ (VFX)పై మెగా అభిమానుల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఎలా స్పందిస్తారు? సినిమా అసలు నేపథ్యం ఏంటి? అనే ప్రశ్నలపై తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో యూవీ క్రియేషన్స్ ప్రతినిధి అజయ్ కుమార్ ఈ విషయంపై స్పందించారు. టీజర్‌లోని విజువల్స్‌పై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను మేము గమనించాం. పెద్ద స్థాయి సినిమాలు తెరకెక్కించేటప్పుడు ఇలాంటి అభిప్రాయాలు రావడం సహజం.

Details

నాణ్యత కోసం ఎక్కువ సమయం

అందుకే రెండో టీజర్‌లో విజువల్ ఎఫెక్ట్స్ మరింత పటిష్టంగా, నెక్స్ట్ లెవల్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. విఎఫ్ఎక్స్ నాణ్యత కోసం కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. దీంతో రెండో టీజర్ మెగా అభిమానులకు నిజమైన విజువల్ ఫీస్ట్‌గా ఉండబోతుందనే అంచనాలు పెరిగాయి. అంతేకాదు 'విశ్వంభర' కేవలం గ్రాఫిక్స్‌పైనే ఆధారపడకుండా, బలమైన భావోద్వేగాలతో కూడిన కథను కూడా ప్రేక్షకులకు అందించనుందని సమాచారం.

Advertisement