Shivaji: ఆ వ్యాఖ్యల తర్వాత మూడు రోజులు నిద్ర రాలేదు : నటుడు శివాజి
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల దుస్తుల ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని నటుడు శివాజి స్పష్టం చేశారు. గతంలో అమ్మాయిల డ్రెస్సింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. తన అసలు ఉద్దేశం ఏమిటో సమాజానికి తెలిసిందని, ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారని తెలిపారు. డ్రెస్సింగ్ గురించి మాట్లాడినప్పుడు నేను రెండు పదాలు వాడాను. అవి వాడకపోయి ఉండాల్సింది. ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పాను. నేను ఎప్పుడూ నియంత్రణ కోల్పోయి మాట్లాడను. కానీ ఆ రోజు ఎందుకు అలా మాట్లాడానో నాకు కూడా అర్థం కాలేదు.
Details
ఆ మహిళపై గౌరవం ఉంది
అన్ని రోజులు మనవి కావు కదా. ఆ పదాలు నోటి నుంచి ఎలా వచ్చాయా అని నేనే ఆలోచించాను. దాంతో మానసికంగా కలతకు గురయ్యాను. మూడు రోజులు నిద్ర కూడా పోలేదు. ఇప్పటివరకు వందలాది ప్రెస్‌మీట్లు, డిబేట్లలో పాల్గొన్నా ఎప్పుడూ నోరు జారలేదు. కానీ ఆ రోజు అలా జరిగిపోయిందని ఆయన వివరించారు. అదేవిధంగా యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించిన వ్యాఖ్యలపైనా స్పందించారు. నేను అనసూయ గురించి ఏమీ అనలేదు. ఆమెతో నాకు పెద్దగా పరిచయం లేదు. ఒకసారి ఆమె నన్ను ఇంటర్వ్యూ చేసింది అంతే. ఆమెపై నాకు గౌరవం ఉంది.
Details
వారు పేర్లు చెప్పడం సబబు కాదు
ఈ ప్రపంచంలో మగవారు ఉద్దేశపూర్వకంగా మహిళలను అవమానించాలని అనుకోవడం సాధారణం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మహిళా కమిషన్‌కు వెళ్లినప్పుడు నాకు పరిచయమైన వారే నాపై ఫిర్యాదు చేశారని తెలిసి షాక్ అయ్యాను. వారి పేర్లు చెప్పను. అలా చెప్పడం సరైంది కాదు. ఇప్పటికీ వారిపై నాకు గౌరవమే ఉందని శివాజీ తెలిపారు. మొత్తానికి, గత వ్యాఖ్యలపై బాధను వ్యక్తం చేసిన ఆయన, మహిళల పట్ల తనకు గౌరవం ఉందని మరోసారి స్పష్టం చేశారు.