LOADING...
satyam rajesh: ఒక అవకాశం.. ఒక సినిమా.. మారిపోయిన జీవితం..'సత్యం'తో స్టార్‌ అయ్యాడు!
ఒక అవకాశం.. ఒక సినిమా.. మారిపోయిన జీవితం..'సత్యం'తో స్టార్‌ అయ్యాడు!

satyam rajesh: ఒక అవకాశం.. ఒక సినిమా.. మారిపోయిన జీవితం..'సత్యం'తో స్టార్‌ అయ్యాడు!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిత్రసీమలో ఎవరికెప్పుడు అదృష్టం కలిసి వస్తుందో చెప్పడం కష్టం. ఒకరి కోసం అనుకున్న పాత్రలో మరొకరు నటించి, అదే పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అలాంటి జాబితాలో 'సత్యం' రాజేష్‌ కూడా ఉంటారు. మొదట విలన్‌ కావాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయనకు అవకాశాలు అంత సులువుగా రాలేదు. రెండు మూడు సంవత్సరాల పాటు స్టూడియోల చుట్టూ తిరుగుతూ, 'సర్... విలన్‌గా చేస్తా, ఛాన్స్ ఇవ్వండి' అని అడిగితే, 'నువ్వా... విలన్‌గా?' అంటూ కొందరు ఆశ్చర్యంగా, మరికొందరు నవ్వుతో స్పందించేవారట. సరైన ఆహారం లేక బరువు తగ్గి, ముఖం కూడా కుంగిపోయి సన్నగా కనిపించడంతో విలన్‌ పాత్రలు అడిగితే మరింతగా తీసిపారేసేవారని రాజేష్‌ పలుమార్లు గుర్తు చేసుకున్నారు.

వివరాలు 

కీలక మలుపుగా 'సత్యం' సినిమా 

అయినా నిరాశపడకుండా ఆడిషన్లకు హాజరవుతూనే ఉన్న ఆయనకు మొదట హీరో స్నేహితుల గ్రూప్‌లో చిన్నచిన్న పాత్రలు రావడం మొదలైంది. వచ్చిన అవకాశాలను వదలకుండా ఉపయోగించుకుంటూ, నెమ్మదిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే సమయంలో 'సత్యం' సినిమా ఆయన జీవితంలో కీలక మలుపుగా మారింది. ఆ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రకు మొదట అలీని ఎంపిక చేశారు. షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభమైన తర్వాత అలీ విదేశాలకు వెళ్లగా,తిరిగి వచ్చే సమయంలో విమానం రద్దు కావడంతో ఆయన రెండు రోజుల పాటు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో షూటింగ్‌ ఆలస్యం కావడం చూసిన దర్శకుడు సూర్య కిరణ్‌ ఆ పాత్రకు రాజేష్‌ను తీసుకుందామనే ఆలోచన చేశారు. విషయం నిర్మాత నాగార్జున దృష్టికి తీసుకెళ్లినా మొదట ఆయన అంగీకరించలేదు.

వివరాలు 

'పులి రాజా'గా సత్యం రాజేష్ 

అలీ వచ్చే వరకూ ఆగుదామని చెప్పారు.అప్పుడు సూర్య కిరణ్‌ తనపై నమ్మకంతో పాటు రాజేష్‌ నటన, కామెడీ టైమింగ్‌పై విశ్వాసం ఉందని చెప్పడంతో చివరకు అవకాశమిచ్చారు. అలా 'సత్యం' సినిమాలో సతీష్‌ పాత్రలో నటించిన రాజేష్‌ తన సహజ నటనతో, కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా 'పులి రాజా' అంటూ చేసే హంగామా అందరికీ బాగా గుర్తుండిపోయింది. ఆ ఒక్క సినిమాతోనే ఆయన కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు రాజేష్‌గా ఉన్న ఆయన, ఆ తర్వాత 'సత్యం' రాజేష్‌గా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.

Advertisement

వివరాలు 

'క్షణం' సినిమాలో పోలీస్‌ అధికారిగా అద్భుతమైన నటన 

తరువాత కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా భిన్నమైన పాత్రలు చేస్తూ తన పరిధిని విస్తరించారు. 'క్షణం' సినిమాలో పోలీస్‌ అధికారిగా నటించి ప్రశంసలు పొందారు. 'మా ఊరి పొలిమేర' సినిమాతో ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచారు. తాజాగా వచ్చిన 'మా ఊరి పొలిమేర 2'లో చేతబడులు చేసే కొమిరి పాత్రలో ఆయన చేసిన నటన మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి విజయం సాధించి, సత్యం రాజేష్‌ స్థాయిని మరింత పెంచింది.

Advertisement