Kalusikovalani: ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ ఆత్మహత్య.. ఆ మూవీ టైటిల్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో సుదీర్ఘకాలం గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి హిట్లలో ఈ సినిమా కూడా ఒకటి. ఇందులో నటించిన హీరోకు అపారమైన క్రేజ్ ఉంది, ముఖ్యంగా యువతిలో అతని ఫ్యాన్స్ సంఖ్య అసాధారణంగా ఎక్కువ. తన ప్రతిభతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న ఈ హీరో, అకాలంగా ఆత్మహత్యచేసి కన్నుమూశాడు. ఈ వార్త అభిమానులను తీవ్రంగా బాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ కూడా అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. అంతేకాదు, మరో హీరోయిన్ ఆత్మహత్యాయత్నం చేసినా, అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.
Details
ఇప్పటికి ప్రేక్షకులకు ఫేవరేట్ గా 'కలుసుకోవాలని'
ఈ సినిమా నిజంగా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకుల ఫేవరెట్‌గా కొనసాగుతోంది. 2002లో రఘురాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఉదయ్ కిరణ్, గజాల, ప్రత్యూష ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీతాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించారు, పాటలు సూపర్ హిట్ అయ్యాయి. హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం అవకాశాల తగ్గడం, కుటుంబ సమస్యలు అని తెలిసింది. హీరోయిన్ ప్రత్యూష మరణం ఇంకా మిస్టరీగా ఉంది. కొన్ని వార్తల్లో ఆమె ఆత్మహత్య చేసిందని, మరికొన్నింటిలో హత్య అని చెప్పారు. మరో హీరోయిన్ గజాల కెరీర్ పీక్‌లో ఉండగా, నిద్రమత్తులు తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. స్నేహితుల సహాయంతో ఆమె ప్రాణాలను నిలబెట్టుకుంది.