LOADING...
Rebel Star : 'కపుల్ ఫ్రెండ్లీ' టీమ్‌తో ప్రభాస్ సరదా ముచ్చట్లు.. రెబల్ స్టార్ లుక్ సోషల్ మీడియాలో వైరల్
'కపుల్ ఫ్రెండ్లీ' టీమ్‌తో ప్రభాస్ సరదా ముచ్చట్లు.. రెబల్ స్టార్ లుక్ సోషల్ మీడియాలో వైరల్

Rebel Star : 'కపుల్ ఫ్రెండ్లీ' టీమ్‌తో ప్రభాస్ సరదా ముచ్చట్లు.. రెబల్ స్టార్ లుక్ సోషల్ మీడియాలో వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో తాజాగా విడుదలైన చిన్న చిత్రాల్లో 'కపుల్ ఫ్రెండ్లీ' మంచి విజయాన్ని నమోదు చేస్తోంది. యంగ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మానస వారణాసి జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు రాబడుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమా సక్సెస్ జోరులో ఉండగానే చిత్ర యూనిట్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మద్దతు లభించడం విశేషంగా మారింది. ఇప్పటికే మేకర్స్ ఇచ్చిన సంకేతాలతో ప్రభాస్ ఈ చిత్ర ప్రమోషన్లలో భాగం కానున్నారని ప్రచారం జరిగింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Details

 శనివారం వీడియో రిలీజ్

ఆ ప్రోమోలో ప్రభాస్ చార్మింగ్ లుక్‌లో కనిపిస్తూ, చిత్ర యూనిట్‌తో సరదాగా ముచ్చటించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇంటర్వ్యూలో పలు ఫన్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా మానస వారణాసి మీకు లవ్ అంటే ఏంటి? అని ప్రశ్నించగా, ప్రభాస్ తనదైన స్టైల్‌లో నవ్వుతూ ఇది పర్సనల్ క్వశ్చన్ అంటూ ఇచ్చిన సమాధానం హైలైట్‌గా మారింది. ఈ స్పెషల్ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వీడియోను ఈ శనివారం విడుదల చేయనున్నట్లు యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ప్రభాస్ వంటి స్టార్ హీరో సపోర్ట్ లభించడంతో 'కపుల్ ఫ్రెండ్లీ' వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement