LOADING...
Saraswathi Trailer: 'ఈ కేసు గెలవడం చాలా కష్టం'.. ఉత్కంఠ రేపుతున్న సరస్వతి ట్రైలర్

Saraswathi Trailer: 'ఈ కేసు గెలవడం చాలా కష్టం'.. ఉత్కంఠ రేపుతున్న సరస్వతి ట్రైలర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2026
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

నటి వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'సరస్వతి'. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేశారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి వరలక్ష్మితో పాటు పూజా శరత్‌కుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ట్రైలర్‌ ప్రకారం, ఒక యువతి మిస్సింగ్‌ కేసు నేపథ్యంగా కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రకాశ్‌రాజ్‌ లాయర్‌ పాత్రలో కనిపిస్తున్నారు. "ఈ కేసు గెలవడం చాలా కష్టం" అని ఆయన చెప్పే డైలాగ్‌తో పాటు తదితర సన్నివేశాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

Advertisement