LOADING...
Funky Oversees Review : ఫంకీ ఓవర్సీస్ టాక్ ఇదే.. విశ్వక్ సేన్‌ ఖాతాలో హిట్ పడిందా?
ఫంకీ ఓవర్సీస్ టాక్ ఇదే.. విశ్వక్ సేన్‌ ఖాతాలో హిట్ పడిందా?

Funky Oversees Review : ఫంకీ ఓవర్సీస్ టాక్ ఇదే.. విశ్వక్ సేన్‌ ఖాతాలో హిట్ పడిందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో 'అవుట్ ఆఫ్ ది బాక్స్' కామెడీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్. ఆయన తాజా చిత్రం 'ఫంకీ' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఓవర్సీస్ ప్రీమియర్లు పూర్తయ్యాక సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సినిమాలో అనుదీప్ స్టైల్‌కు తగ్గట్టుగా వన్‌లైనర్ జోకులు బాగానే వర్క్ అయ్యాయి. చాలా చోట్ల నవ్వులు పూయిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో కామెడీ మోతాదు మించిపోయి ప్రేక్షకులకు చిరాకు తెప్పించే స్థాయికి చేరినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పూర్తిగా అనుదీప్‌కు చిహ్నమైన వన్‌లైనర్లపైనే నడుస్తుంది. సెకండ్ హాఫ్‌లో కూడా అదే రొటీన్ ఫార్ములా కొనసాగుతుంది.

Details

అతిథి పాత్రలో మెరిసిన డైరక్టర్లు

కొంతవరకు ఎంటర్‌టైన్ చేసినా, గొప్పగా అనిపించదనే అభిప్రాయం వినిపిస్తోంది. మెకానికల్ కుటుంబ విలువలపై అనుదీప్ చేసిన ట్రోలింగ్ ఆకట్టుకుంటుంది. కానీ హీరో-హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ మాత్రం మెప్పించలేకపోయింది. మేకర్స్ ముందుగానే చెప్పినట్టుగా సినిమాలో బలమైన కథాంశం లేదు. దర్శకుడి పాత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా ప్రాసలు, సిల్లీ వన్‌లైనర్లతో ముందుకు సాగుతుంది. కథ ఫిల్మ్‌మేకింగ్ నేపథ్యంలో సాగడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్‌తో దిల్ రాజు, నాగ వంశీ సరదా అతిథి పాత్రల్లో కనిపించారు. అలాగే దర్శకులు హరిశ్ శంకర్, అనుదీప్, కళ్యాణ్ కృష్ణ గెస్ట్ రోల్స్‌లో మెరిశారు. ఈ చిత్రానికి ప్రధాన మైనస్ ఎడిటింగ్. చాలా చోట్ల సన్నివేశాల మధ్య సరైన ఫ్లో కనిపించదు.

Details

చాలా రోటీన్ గా రైటింగ్

సినిమా చూస్తున్నంతసేపు యూట్యూబ్‌లో కామెడీ క్లిప్స్‌ను వరుసగా చూసినట్లుగా అనిపిస్తుందని ప్రేక్షకుల అభిప్రాయం. డబ్బింగ్ విషయంలోనూ సింక్ సమస్యలు స్పష్టంగా కనిపించి అసహనం కలిగిస్తాయి. 'మాస్ కా దాస్'గా పేరుగాంచిన విశ్వక్ సేన్ ఎనర్జీ అందరికీ తెలిసిందే. అయితే ఈ తరహా సిల్లీ కామెడీ ఆయనకు సెట్ కాలేదనే భావన వ్యక్తమవుతోంది. పాత్రలో పూర్తిగా ఇమడలేక ఇబ్బంది పడినట్లు కనిపించిందని టాక్. అనుదీప్ రైటింగ్ కూడా చాలా రొటీన్‌గా మారిందని, ఇప్పటికీ ఆయన జాతి రత్నాలు జోన్‌లోనే ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా మేకర్స్ చెప్పినట్టుగా బలమైన కథ లేకపోయినా 'ఫంకీ' సినిమా మిశ్రమ స్పందనను రాబట్టింది.

Advertisement