Vijay - Rashmika : హాట్‌టాపిక్‌గా రష్మిక-విజయ్ పెళ్లి.. రిసెప్షన్‌కు రానున్న స్టార్లు ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన రష్మిక మందన్న-విజయ్ దేవరుకొండ పెళ్లి వార్తలు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయన్న ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు మేము కేవలం స్నేహితులమే అంటూ బహిరంగంగా చెప్పుకొచ్చిన ఈ జంట, నిజంగానే ఏడడుగులు వేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో వీరి వివాహం జరగనుందనే టాక్ టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉన్న ఓ రాయల్ ప్యాలెస్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక నిర్వహించనున్నారట. ఫిబ్రవరి 26ను ముహూర్తంగా ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Details
సోషల్ మీడియా ద్వారా సమాచారం లీక్
ఈ వేడుకను ఎంత గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా, సోషల్ మీడియా ద్వారా సమాచారం లీక్ అవుతూనే ఉంది. ఉదయ్‌పూర్‌లో వివాహం సాదాసీదాగా జరగనుండగా, అసలు వేడుక మాత్రం హైదరాబాద్‌లో ఉండబోతుందనే సమాచారం వినిపిస్తోంది. మార్చి 4న నగరంలోని ఓ ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరవుతారని అంచనా. ఇటీవల విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారనే ప్రచారం ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూర్చింది.
Details
ప్రముఖ దర్శకులు హజరయ్యే అవకాశం
ఆ భేటీ తర్వాత సోషల్ మీడియాలో "పెళ్లి ఖాయం" అన్న చర్చ మరింత వేగం అందుకుంది ఈ రిసెప్షన్‌కు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, స్టార్ హీరోలు హాజరవుతారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విజయ్‌కు అత్యంత సన్నిహితుడైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారనే టాక్ వినిపిస్తోంది. రష్మిక-విజయ్‌లతో కలిసి పని చేసిన పలువురు దర్శకులు, టెక్నీషియన్లు కూడా పాల్గొనే అవకాశముంది.