Vijay Devarakonda- Rashmika: విజయ్ - రష్మిక పెళ్లి ముహూర్తం ఖరారు.. వెడ్డింగ్ కార్డ్ లీక్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో సంచలన జంటగా పేరొందిన విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల పెళ్లి వార్తలు కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా వారి వివాహ నిశ్చయ తాంబూలాల ఆహ్వాన పత్రిక (వెడ్డింగ్ ఇన్విటేషన్) నెట్‌లో వైరల్ అవుతోంది వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ ప్రకారం, వీరి వివాహం ఫిబ్రవరి 26, 2026న అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్ వేడుకగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఈ పెళ్లి జరగనుందని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నట్లు సమాచారం.
Details
కృష్ణ హోటల్‌లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు
ఇక సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా మార్చి 04, 2026 (బుధవారం) సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్‌లోని ప్రఖ్యాత తాజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆహ్వాన పత్రికను విజయ్ దేవరకొండ తన పేరుతో—రష్మిక తరపున కూడా—పంపిస్తూ, తమ కొత్త జీవిత ప్రయాణానికి అందరి ఆశీస్సులు కావాలని కోరుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి ఆహ్వానించిన ఫోటోలు బయటకు రావడం, ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్ కూడా లీక్ కావడంతో ఈ పెళ్లి వార్త అధికారికంగా ధృవీకరించనట్లుగా ప్రచారం సాగుతోంది.