టాలీవుడ్: వార్తలు

ఇంటివాడు కాబోతున్న హీరో శర్వానంద్, ఎంగేజ్ మెంట్ ఎప్పుడంటే

టాలీవుడ్ లో పెళ్ళి బాజాలు వరుసగా వినిపించనున్నాయి. యంగ్ హీరోలు అందరూ ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలెక్కబోతున్నారు. మొన్నటికి మొన్న నాగశౌర్య వివాహం జరిగింది.

తెలుగు సినిమా: ఉస్తాద్ రామ్ తో ధమాకా శ్రీలీల రొమాన్స్ షురూ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఉస్తాద్ రామ్ గా మారిపోయాడు. ఐతే ఇస్మార్ట్ విజయం తర్వాత రామ్ ఖాతాలో మరో విజయం చేరలేదు.

ఆర్ఆర్ఆర్: ఆస్కార్ పొందే అవకాశం ఉన్న జాబితాలో ఎన్టీఆర్ పేరు

ప్రపంచ సినిమా అవార్డ్స్ అన్నింటిలో ఆస్కార్ స్థానం ప్రత్యేకం. ఏ దేశ కళాకారులైనా ఒక్కసారైనా ఆస్కార్ అందుకోవాలని ఆశపడుతుంటారు. ఆస్కార్ కోసమే సినిమాలు చేస్తుంటారు కూడా.

ఫిబ్రవరిలో తెలుగు తెర మీద చిన్న సినిమాల సందడి

తెలుగు బాక్సఫీసు వద్ద సంక్రాంతి సందడి వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతీ ఒక్కరూ తమ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటారు.

04 Jan 2023

సినిమా

నిర్మాత సురేష్ బాబుపై ప్రశంసల వర్షం.. ట్రాఫిక్ క్లియరెన్స్ వీడియో వైరల్

గొప్పవాళ్ళు కావడానికి పెద్ద పనులే చేయాల్సిన అవసరం లేదు. నిజానికి చిన్న చిన్న పనులను కూడా బాధ్యాతయుతంగా చేస్తారు కాబట్టే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ప్రస్తుతం హైదరాబాద్ ఫిలిమ్ నగర్ లో జరిగిన ఒక సంఘటన పై వాక్యాన్ని నిజం చేస్తోంది.

ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ.. త్వరలోనే ప్రకటన

ఎన్టీఆర్30 సినిమా నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు అందరూ ఆశగా ఎదురుచూసారు. రిలీజ్ డేట్ ప్రకటనతో ఆ ఆశ కొంత తీరినప్పటికీ, హీరోయిన్ ఎవరనే విషయం మీద అంతా ఆసక్తిగా ఉన్నారు.

అవెంజర్ యాక్టర్ కి యాక్సిడెంట్.. పరిస్థితి విషమం

మార్వెల్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మార్వెల్ నుండి ఏ సినిమా వచ్చినా ఎగబడి చూసేస్తుంటారు. దానివల్ల మార్వెల్ సినిమాల్లో నటించే వాళ్ళకు కూడా ప్రపంచ మొత్తం అభిమానులు ఏర్పడ్డారు.

ఫలానా అమ్మాయి ప్రేమలో నాగశౌర్య.. కొత్త సినిమా ప్రకటన

క్రిష్ణ వ్రింద విహారి సినిమా తర్వాత నాగశౌర్య తన కొత్త సినిమాను ప్రకటించాడు. "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది.

వాల్తేరు వీరయ్య: మేకింగ్ వీడియోలో చిరంజీవి నుండి మరో లీక్

సంక్రాంతి సందర్భంగా థియేటర్ల వద్ద రచ్చ చేయడానికి వాల్తేరు వీరయ్య రెడీ అవుతున్నాడు. ప్రమోషన్ల జోరు చూస్తుంటే ఈ విషయం తెలిసిపోతుంది. మరికొద్ది రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో చివరి పాటను కూడా వదిలే పనిలో ఉన్నారు.

2022: తెలుగు తెరకు పరిచయమైన డబ్బింగ్ హీరోలు.. మొదటి స్థానంలో ఎవరున్నారంటే

సినిమాలోని ఏదైనా అంశానికి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయితే ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని మోస్తారు. అందులో హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎవరన్న సంగతి వాళ్ళు పట్టించుకోరు.

అల్లు అరవింద్ భారీ ఆఫర్.. ఆ సినిమాల్లో హీరో నిఖిల్ కి షేర్

2022సంవత్సరం హీరో నిఖిల్ కి బాగా కలిసొచ్చింది. ఆగస్టులో కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో విజయం అందుకుని, చివర్లో 18 పేజెస్ తో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

కొత్త సంవత్సరంలో ఏం చేయాలో చెబుతూ సమంత ఎమోషనల్ పోస్ట్

స్టార్ హీరోయిన్ సమంత, యశోద సినిమా విడుదల సమయంలో తన అనారోగ్యం గురించి అందరి ముందు బయటపెట్టింది. ఆటో ఇమ్యూన్ వ్యాధిరకమైన మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది సమంత.

జీ2 ని రెడీ చేస్తున్న అడవి శేష్.. డేట్ ఫిక్స్

అడవి శేష్.. క్షణం సినిమా నుండి మొన్న వచ్చిన హిట్ 2 వరకు అన్నింట్లోనూ విజయం అందుకున్నాడు. ఈ మధ్య తెలుగు సినిమాకి ఇన్ని హిట్లు అందించిన హీరో కనబడలేదు.

వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది

గాడ్ ఫాదర్ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

గ్యాంగ్ లీడర్ తో పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత నటుడు వల్లభనేని జనార్ధన్ ఇక లేరు

చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ సుమలతకు తండ్రి పాత్రలో మెప్పించిన నటుడు వల్లభనేని జనార్ధన్, ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు.

నాగ చైతన్య కస్టడీ

తెలుగు సినిమా

వేసవిలో వస్తున్న నాగచైతన్య కస్టడీ.. విడుదల తేదీ ప్రకటన

థ్యాంక్యూ సినిమాతో అతిపెద్ద అపజయాన్ని మూటగట్టుకున్న అక్కినేని వారసుడు నాగ చైతన్య, ప్రస్తుత్రం ద్విభాషా చిత్రం కస్టడీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా నుండి నాగ చైతన్య పుట్టినరోజున ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది.

బాహుబలిని ఫాలో అవుతున్న పొన్నియన్ సెల్వన్.. రెండో భాగం విడుదల తేదీ ప్రకటన

బాహుబలి సినిమాతో దేశంలో పెద్ద సంచలనం చెలరేగింది. పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా వర్కౌట్ అవుతాయని చూపించిన సినిమా అది. అందుకే అప్పటి నుండి అన్ని ఇండస్ట్రీల్లోనూ అలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఇడియట్ 2 సీక్వెల్ పై ఆన్సర్ చేసిన మాస్ మహారాజా రవితేజ

ఇడియట్.. రవితేజ కెరీర్ ని పూర్తిగా మలుపు తిప్పిన సినిమా ఇది. అప్పటివరకు వెండితెర మీద ఎన్నో సినిమాల్లో కనిపించినప్పటికీ ఇడియట్ సినిమాతోనే హీరోగా నిలదొక్కుకున్నాడు రవితేజ.

2022లో తెలుగు తెరకు పరిచయమైన హీరోలు, హీరోయిన్లు

తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్ ని ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సంవత్సరం తెలుగు తెరమీద చాలామంది కొత్తవాళ్ళు కనిపించారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంలో ఈ సంవత్సరం కొత్తగా మెరిసిన వారి గురించి తెలుసుకుందాం.

సోషల్ మీడియా సాక్షిగా థ్యాంక్స్ చెప్పిన ఉపాసన

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. ఈ విషయమై అభిమానులు అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.

సమంతకు ధైర్యం చెబుతూ రాహుల్ రవీంద్ర గిఫ్ట్.. ఆందోళనలో అభిమానులు

స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. యశోద సినిమా రిలీజ్ సమయంలో తన అనారోగ్యం గురించి అందరితో పంచుకుంది సమంత.

2022 రివైండ్: బాక్సాఫీసు దగ్గర మెరిసిన కుర్ర హీరోలు

2022 సంవత్సరం తెలుగు బాక్సాఫీసు వసూళ్ళ వర్షంతో నిండిపోయింది. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా ఉత్సాహంగా ఉంది. అదే ఉత్సాహంలో 2023లో మరిన్ని విభిన్నమైన కథలు అందించేందుకు రెడీ అవుతోంది.

అది వినగానే పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టారు.. ఖుషీ నిర్మాత ఏఎమ్ రత్నం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో ఖుషీ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. 2001లో విడుదలైన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ నటనకు సరికొత్త స్టైల్ ని తీసుకొచ్చింది.

షూటింగ్ సెట్లో ప్రభాస్, మారుతి.. ఫోటోలు వైరల్

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుందనగానే ఫ్యాన్స్ అంతా గోలగోల చేసారు. ప్రస్తుతం సినిమా మొదలైంది. ఆల్రెడీ షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ మేరకు ఇంటర్నెట్ లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

2022 సంవత్సరాన్ని మంచి సినిమాతో ముగించాలనుకుంటున్నారా? ఈ లిస్ట్ చూడండి

2022 సంవత్సరం తెలుగు సినిమాకు బాగా కలిసొచ్చింది. బాక్సాఫీసు వద్ద మంచి మంచి సినిమాలు పడ్డాయి. ఆర్ఆర్ఆర్ మొదలుకుని మొన్న రిలీజైన ధమాకా, 18 పేజెస్ వరకు బాక్సాఫీసును షేక్ చేసాయి.

ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దేశవ్యాప్తంగా తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

కలవరపెడుతున్న వరుస టాలీవుడ్ నటుల మరణాలు

గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతున్న వరుస మరణాలు తెలుగు సినిమా అభిమానులకు కలవరం కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న సీనియర్ నటుడు చలపతి రావు హఠాత్తుగా చనిపోవడంతో అందరూ దిగ్భ్రాంతి చెందారు.

2022 రివైండ్: తెలుగు తెరకు దిగొచ్చిన బాలీవుడ్ తారలు

ఈ సంవత్సరం తెలుగు చిత్రపరిశ్రమకు కలిసి వచ్చిందనే చెప్పాలి. డైరెక్ట్ సినిమాల నుండి డబ్బింగ్ సినిమాల వరకు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించాయి.

బర్త్ డే స్పెషల్: తీయనైన తెలుగులో మహ్మద్ రఫీ పాట.. తేనెకన్నా మధురం

1970, 80ల్లో మీకు ఏ సింగర్ ఇష్టమని ఎవరినైనా అడిగితే భాషతో సంబంధం లేకుండా అందరూ మహ్మద్ రఫీ అని చెప్పేవారు. ఆ గొంతులో ఉన్న మాధుర్యానికి అంతగా పరవశించిపోయారు.

తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా

ఈ సంవత్సరం తెలుగు సినిమాకు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్, కార్తికేయ, సీతారామం, బింబిసార సినిమాలతో బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిసింది.

బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల

మాస్ దేవుడు బాలకృష్ణ, సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. జనవరి 12వ తేదీన వీరసింహారెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

24 Dec 2022

సినిమా

వీరసింహారెడ్డి: బాలయ్య మనోభావాలు దెబ్బతిన్నాయి

అఖండ సినిమా విజయం తర్వాత బాలయ్య నుండి వస్తున్న వీరసింహారెడ్డి అనే సినిమా వస్తోంది. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బిజీగా గడుపుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు కోసం ఇటీవల 40రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు.

వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రెడీ అవుతోంది. 2023 జనవరి 13వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఐతే ప్రచార పనులు మాత్రం పెద్ద ఎత్తున ఇంకా మొదలు కాలేదు.

మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా?

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్ళిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల, వరుస సినిమాలకు సంతకాలు చేస్తూ బిజీగా ఉంది.

2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు

ఈ సంవత్సరంలో చాలా అంచనాలతో విడుదలైన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

23 Dec 2022

సినిమా

ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో

తెలుగు సినిమా పుస్తకంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని ఏర్పాటు చేసుకున్న నటుడు కైకాల సత్యనారాయణ. విలన్ పాత్రలతో మెప్పించి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి, కామెడీ పాత్రల్లోనూ తనదైన ముద్ర కనబర్చిన నటుడు కైకాల.

23 Dec 2022

సినిమా

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

తెలుగు సినిమా కళామతల్లి మరో పెద్ద దిక్కును కోల్పోయింది. యముడి పాత్రలు చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈ రోజు ఉదయం కన్నుమూసారు.

రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం

నటనకు నిర్వచనమైన మన మెగాస్టార్ చిరంజీవి, నటుడిని నిర్వచించే పాత్రలు ఎన్నో చేసారు. కానీ మొదటిసారిగా నటుడిని నిర్వచిస్తూ షాయరీని వినిపించారు.

22 Dec 2022

రాంచరణ్

ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో..

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల మహోత్సవం మరో మూడు నెలల్లో ఉండనుంది. ఈ మూడు నెలల ముందు నుండే ఆస్కార్ సందడి మొదలైంది.