2022లో తెలుగు తెరకు పరిచయమైన హీరోలు, హీరోయిన్లు
తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్ ని ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సంవత్సరం తెలుగు తెరమీద చాలామంది కొత్తవాళ్ళు కనిపించారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంలో ఈ సంవత్సరం కొత్తగా మెరిసిన వారి గురించి తెలుసుకుందాం. బెల్లంకొండ గణేష్: నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి తమ్ముడైన గణేష్, స్వాతి ముత్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. నటనలో గణేష్ కి విమర్శకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. అశోక్ గల్లా: పార్లమెంట్ మెంబర్ జయదేవ్ గల్లా కుమారుడైన అశోక్ గల్లా, హీరో సినిమాతో తెలుగు సినిమాల్లోకి వచ్చాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.
కొత్తగా మెరిసిన నటులు
ఆశిష్: రౌడీబాయ్స్ సినిమాతో హీరోగా మారి ఓ మోస్తారు విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు ఆశిష్. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించింది. ఆలియా భట్: రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత డబ్బింగ్ సినిమా బ్రహ్మాస్త్రతో మరో మారు తెలుగు ప్రేక్షకులను కనువిందు చేసింది. సంయుక్తా మీనన్: మలయాళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్థానం దక్కించుకున్న సంయుక్త, భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బింబిసార సినిమాలో మెరిసింది. మృణాల్ ఠాకూర్: సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది మృణాల్. సీతగా ఆమె పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.