LOADING...
Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్.. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం : రోహిత్ శర్మ
రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్.. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం : రోహిత్ శర్మ

Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్.. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం : రోహిత్ శర్మ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన వన్డే భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు స్పష్టత ఇచ్చాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో తన పాల్గొనడం గురించి ఆయన కీలక ప్రకటన చేశాడు. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన రోహిత్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో నిర్వహించనున్న 2027 ఐసీసీ వరల్డ్ కప్ సమయానికి రోహిత్ వయసు 40 ఏళ్లు పూర్తవుతుంది. అయినప్పటికీ, ప్రపంచకప్ ట్రోఫీని జట్టుతో కలిసి ఎత్తడమే తన తుది లక్ష్యమని స్పష్టం చేశాడు. ఆ దిశగా తాను కష్టపడటానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు.

Details

ఆ ట్రోఫీ గెలవడమే తన లక్ష్యం

ఐసీసీ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్, "నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్లి నా దేశం కోసం ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నాను. ఇది నేను ఎప్పుడూ కలలు కనే విషయం. నేను 50 ఓవర్ల ప్రపంచకప్ చూస్తూ పెరిగాను. అప్పట్లో టీ20 ప్రపంచకప్ లేదా ఐపీఎల్ లేవు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ టోర్నీ క్రికెట్‌లో శిఖరాగ్ర సమరమని వ్యాఖ్యానించాడు. తాను చిన్ననాటి నుంచే 50 ఓవర్ల ప్రపంచకప్ ట్రోఫీపై మక్కువ పెంచుకున్నానని చెబుతూ, "నాకు ఆ ట్రోఫీ కావాలి. దాన్ని సాధించేందుకు నా శక్తి సామర్థ్యాల మేరకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తన సంకల్పాన్ని వ్యక్తం చేశాడు.

Details

గ్రేడ్-బీలో రోహిత్ - విరాట్

గత సంవత్సరం భారత్ టీ20 ప్రపంచకప్ విజయం సాధించిన తర్వాత 38 ఏళ్ల వయసులో రోహిత్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతకుముందు, మే నెలలో టెస్ట్ క్రికెట్‌కూ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక బీసీసీఐ ఆటగాళ్ల వార్షిక కేంద్ర కాంట్రాక్టుల కొత్త జాబితాను విడుదల చేసింది. ఈసారి పెద్ద మార్పు చేస్తూ, గతంలో రూ.7 కోట్ల రిటైనర్ ఫీజు ఉన్న A+ కేటగిరీని పూర్తిగా రద్దు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రేడ్-బీలోకి చేరారు. బోర్డు మొత్తం 30 మంది పురుషులు, 21 మంది మహిళా క్రికెటర్లకు కాంట్రాక్టులు ఇచ్చింది. వీరిని A, B, C గ్రూపులుగా విభజించారు.

Advertisement

Details

గ్రేడ్-ఏలో బుమ్రా, గిల్, జడేజా

గత సీజన్‌లో ఆటగాళ్ల ప్రదర్శన, ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా కొత్త కాంట్రాక్టులు ఖరారు చేసినట్లు సమాచారం. కొత్త జాబితాలో వన్డే, టీ20 కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, టెస్ట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గ్రేడ్-ఏలో కొనసాగారు. అయితే, ఈసారి మూడు విభాగాలకు సంబంధించిన రిటైనర్ ఫీజులను బోర్డు వెల్లడించలేదు. రోహిత్, విరాట్ ప్రస్తుతం వన్డే ఒక్క ఫార్మాట్‌లోనే ఆడుతున్న కారణంగా వారిని గ్రేడ్-బీకి మార్చినట్లు తెలుస్తోంది.

Advertisement