Loading...
Black Sea: నల్ల సముద్రంలో వాణిజ్య నౌకపై దాడి.. భారతీయుడు మృతి
నల్ల సముద్రంలో వాణిజ్య నౌకపై దాడి.. భారతీయుడు మృతి

Black Sea: నల్ల సముద్రంలో వాణిజ్య నౌకపై దాడి.. భారతీయుడు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 25, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

నల్ల సముద్రంలో ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. నౌకలో మొత్తం పది మంది సిబ్బంది ఉండగా, వారిలో ముగ్గురు భారతీయులేనని భారత విదేశాంగ శాఖ (MEA) వెల్లడించింది. మిగిలిన ఇద్దరు భారతీయులు సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ వివరాల ప్రకారం ఎంవీ ఒమోర్ఫీ (MV Omorfi) అనే వాణిజ్య నౌక జులై 18న రష్యా ప్రాదేశిక జలాల్లో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఘటనపై రష్యాలోని భారత రాయబార కార్యాలయం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది. అలాగే మృతుడి కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

వివరాలు

దాడిని తీవ్రంగా ఖండించిన భారత్

వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.

అమాయక పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా, అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను ప్రమాదంలో పడేసే ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని విదేశాంగ శాఖ పేర్కొంది.

సముద్ర మార్గాల్లో భద్రతను కాపాడాల్సిన అవసరాన్ని కూడా భారత్ నొక్కి చెప్పింది.

ఇదిలా ఉండగా, జులై 19న ఉక్రెయిన్ తీరంలో ఓ వాణిజ్య నౌకపై జరిగిన మరో దాడిలో మరణించిన 10 మందిలో నలుగురు భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ ఇటీవల ప్రకటించింది.

వరుసగా వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.

ADVERTISEMENT