Vishwambhara : చిరు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'విశ్వంభర' రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సోషియో ఫ్యాంటసీ మూవీ 'విశ్వంభర'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. గ్రాఫిక్స్ పనుల్లో ఆలస్యం, ఓటీటీ బిజినెస్ కాస్త ఆలస్యం కావడంతో విడుదల విషయంలో కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేయడంతో 'విశ్వంభర' రిలీజ్‌కు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఓటీటీ బిజినెస్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వివరాలు
సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్
తాజా సమాచారం ప్రకారం.. 'విశ్వంభర' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం సోనీ లివ్‌తో పోటీపడిన 'అమెజాన్ ప్రైమ్ వీడియో'.. చివరకు భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు సమాచారం.
ఓటీటీ డీల్ పూర్తవడంతో థియేట్రికల్ రిలీజ్‌కు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే 'విశ్వంభర'ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివరాలు
'కాకా' వాయిదా పడే అవకాశం
యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తున్నారు.
ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక 'విశ్వంభర' సంక్రాంతి బరిలోకి వస్తే..
బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న 'కాకా' సినిమా విడుదల సమ్మర్‌కు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.