Raaka Movie: దుబాయ్ నుంచి ఆర్‌ఎఫ్‌సీకి షిఫ్టైన రాకా
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'రాకా' షూటింగ్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మొదట దుబాయ్‌లో చిత్రీకరించాలని భావించిన కీలక యాక్షన్ సన్నివేశాలను ఇప్పుడు హైదరాబాద్‌లోనే తెరకెక్కించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఈ మార్పు వెనుక పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణమే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Details
దుబాయ్ షెడ్యూల్‌కు బ్రేక్.. మారిన అట్లీ ప్లాన్?
'రాకా' షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కువ భాగం ముంబయిలోనే జరుగుతున్నట్లు సమాచారం.
సినిమా కథకు అనుగుణంగా భారీ సెట్లు నిర్మించి, చిత్రీకరణను అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
తదుపరి షెడ్యూల్‌లో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించాలని దర్శకుడు అట్లీ భావించారట. ఇందుకోసం దుబాయ్‌ను ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశీ షెడ్యూల్‌ను నిర్వహించడం కష్టమవుతుందని భావించి, హైదరాబాద్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నట్లు సినీ వర్గాల సమాచారం.
Details
బన్నీకి సొంతూరిలోనే షూటింగ్!
ఈ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగితే అల్లు అర్జున్‌కు ప్రయాణ భారం కొంత తగ్గనుంది. గత కొన్ని నెలలుగా 'రాకా' చిత్రీకరణ కోసం ఆయన హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్లి వస్తున్నారు.
ఇప్పుడు షూటింగ్ నగరానికి మారితే తన సొంతూరిలోనే పని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, సినిమాలోని ఇతర ముఖ్య నటీనటులు కూడా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ షెడ్యూల్‌లో ఎవరెవరు పాల్గొంటారనే వివరాలు ఇంకా బయటకు రాలేదు.
Details
రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ సిద్ధమవుతున్నాయా?
'రాకా' షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుందనే వార్తతో అల్లు అర్జున్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఒకవేళ ఈ ప్రణాళిక ఖరారైతే, హైదరాబాద్‌లో జరిగే తొలి షెడ్యూల్ ఇదే కానుంది.
అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎన్ని రోజులు కొనసాగుతుంది? యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేక సెట్లు నిర్మిస్తున్నారా? వంటి ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది.
ఇప్పటివరకు సినిమా నుంచి పెద్దగా అప్‌డేట్స్ ఇవ్వని చిత్రబృందం, తదుపరి షెడ్యూల్‌పై ఎప్పుడు స్పష్టత ఇస్తుందో చూడాలి.