Loading...
ENE Repeat Trailer : 'ఈ నగరానికి ఏమైంది 2' ట్రైలర్‌ వచ్చేసింది.. నవంబర్‌ 19న థియేటర్లలో సందడి!

ENE Repeat Trailer : 'ఈ నగరానికి ఏమైంది 2' ట్రైలర్‌ వచ్చేసింది.. నవంబర్‌ 19న థియేటర్లలో సందడి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2026
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

2018లో తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా చిన్న చిత్రంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యూత్‌ను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. నలుగురు స్నేహితుల మధ్య సాగే కథ, కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. దీంతో ఈ సినిమా కాలక్రమంలో క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చిత్రానికి సీక్వెల్‌ను కూడా ప్రకటించారు. 'ENE రిపీట్‌' (ఈ నగరానికి ఏమైంది 2) పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్‌ 19న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

వివరాలు

ప్రధాన పాత్రల్లో విశ్వక్‌ సేన్‌ అండ్‌ ఫ్రెండ్స్

ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌, సాయినాథ్‌ మాగంటి, అభినవ్‌ గోమఠం, వెంకటేష్‌ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అనిషా అంబ్రోస్‌, శివాత్మిక రాజశేఖర్‌, ప్రియదర్శిని రామ్‌, కరుణకుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మొదటి భాగాన్ని గోవా నేపథ్యంలో తెరకెక్కించగా.. సీక్వెల్‌ను బ్యాంకాక్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించినట్లు తెలుస్తోంది.

'ఈ నగరానికి ఏమైంది' మొదటి భాగం చివర్లో విశ్వక్‌ సేన్‌.. విజయ్‌ దేవరకొండతో కలిసి షార్ట్‌ ఫిల్మ్‌ తీస్తున్నట్లు చూపించారు.

వివరాలు

విజయ్‌ దేవరకొండ వాయిస్‌తో ట్రైలర్‌ ప్రారంభం

ఇప్పుడు 'ENE రిపీట్‌' ట్రైలర్‌ కూడా అక్కడి నుంచే ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ వాయిస్‌తో ట్రైలర్‌ను ఓపెన్‌ చేశారు.

ఈసారి విశ్వక్‌ సేన్‌ సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు ట్రైలర్‌లో చూపించారు.

ఈ క్రమంలో నలుగురు స్నేహితులు బ్యాంకాక్‌కు వెళ్లడం, అక్కడ వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, మధ్యలో చోటుచేసుకునే సరదా సంఘటనలు, కామెడీ సన్నివేశాలతో సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది.

మొదటి భాగంలో ప్రేక్షకులను అలరించిన నలుగురు స్నేహితుల సందడి.. సీక్వెల్‌లోనూ కొనసాగనున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

మరి 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్‌ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే నవంబర్‌ 19 వరకు వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT