Loading...
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. ఏర్పాట్లపై కీలక ఆదేశాలు
భోగాపురం ఎయిర్‌పోర్టులో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. ఏర్పాట్లపై కీలక ఆదేశాలు

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. ఏర్పాట్లపై కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 25, 2026
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో పాటు జీఎంఆర్ (GMR) ప్రతినిధులతో సమావేశమై ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

వివరాలు

మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం

ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల నుంచి సుమారు మూడు లక్షల మంది ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

అంత భారీ సంఖ్యలో ప్రజలు వచ్చినా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్రాఫిక్ నుంచి భద్రత వరకు ప్రతి అంశంపై ఆరా

ప్రారంభోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, ప్రొటోకాల్ ఏర్పాట్లు, సభ నిర్వహణ, భద్రతా చర్యలు, తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల ఏర్పాటు తదితర కీలక అంశాలపై మంత్రి లోకేశ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

వివరాలు

పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధుల పాల్గొనడం

ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, చింతకాయల విజయ్, టీడీపీ జాతీయ కార్యదర్శి కిలారి రాజేశ్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజుతో పాటు పలువురు అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు కూడా హాజరై ఏర్పాట్లపై చర్చించారు.

ADVERTISEMENT