Loading...
'Mr. Singh': 'మిస్టర్ సింగ్' పోస్టర్‌పై సిక్కు సంఘాల ఆగ్రహం.. పోస్ట్ తొలగించిన డీహెచ్‌ఎస్
'మిస్టర్ సింగ్' పోస్టర్‌పై సిక్కు సంఘాల ఆగ్రహం.. పోస్ట్ తొలగించిన డీహెచ్‌ఎస్

'Mr. Singh': 'మిస్టర్ సింగ్' పోస్టర్‌పై సిక్కు సంఘాల ఆగ్రహం.. పోస్ట్ తొలగించిన డీహెచ్‌ఎస్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) రూపొందించిన ఓ ఏఐ పోస్టర్ తీవ్ర వివాదానికి కారణమైంది. 'మిస్టర్ సింగ్'పేరుతో రూపొందించిన ఈ ప్రచార పోస్టర్ జాతి వివక్షను ప్రోత్సహించేలా ఉందంటూ సిక్కు, భారతీయ అమెరికన్ సంఘాలు,పలువురు రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో డీహెచ్‌ఎస్ ఆ పోస్టర్‌ను ఉపసంహరించుకుంది. అనధికారిక కమర్షియల్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రచారాన్ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 9న డీహెచ్‌ఎస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ పోస్టర్‌ను ప్రచురించింది. ఇది 'ట్రాన్స్‌ఫార్మర్స్:ఏజ్ ఆఫ్ డిపోర్టేషన్స్'అనే సినిమా పోస్టర్‌ను పోలి ఉండటం గమనార్హం. పోస్టర్‌లో డీహెచ్‌ఎస్ లోగో కలిగిన ఓ రోబోట్.. గడ్డం,తలపాగా ధరించిన దక్షిణాసియా వ్యక్తిపై దాడి చేస్తున్నట్లుగా చూపించారు.

వివరాలు 

సిక్కు, హిందూ సంఘాల తీవ్ర ఆగ్రహం

అంతేకాకుండా.. 'మా రోడ్ల నుంచి దిగిపోండి, మిస్టర్ సింగ్.. మీకు డ్రైవింగ్ రాదు', 'స్వయంగా దేశం విడిచి వెళ్లండి లేదా పరిణామాలు ఎదుర్కోండి' వంటి నినాదాలను అందులో ఉపయోగించారు.

ఈ సందేశాలే వివాదానికి ప్రధాన కారణమయ్యాయి.

పోస్టర్‌ను ఎక్స్‌లో ప్రచురించిన వెంటనే సిక్కు కోయలిషన్, హిందూ అమెరికన్ ఫౌండేషన్ సహా పలు సంస్థలు తీవ్రంగా స్పందించాయి.

'సింగ్' అనేది సిక్కులు, హిందువుల్లో విస్తృతంగా ఉపయోగించే ఇంటిపేరని, అమెరికాలోనూ లక్షలాది మంది ఈ పేరుతో ఉన్నారని ఆయా సంస్థలు పేర్కొన్నాయి.

ఒక నిర్దిష్ట వ్యక్తిని ఉద్దేశించిన ప్రచారంగా కాకుండా, మొత్తం ఓ సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా పోస్టర్ కనిపిస్తోందని ఆరోపించాయి.

వివరాలు 

సిక్కు, హిందూ సంఘాల తీవ్ర ఆగ్రహం

ఈ వ్యవహారంపై రాజకీయంగానూ విమర్శలు వచ్చాయి.

కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తదితరులు పోస్టర్‌ను జాతి వివక్షకు ఉదాహరణగా అభివర్ణించారు.

ప్రభుత్వ విభాగం ప్రచారంలో ఇలాంటి చిత్రణలు ఉపయోగించడం సరికాదని విమర్శించారు.

ADVERTISEMENT

వివరాలు 

పోస్టర్‌ను తొలగించిన డీహెచ్‌ఎస్

తీవ్ర విమర్శలు ఎదురవడంతో డీహెచ్‌ఎస్ గురువారం తన ఎక్స్ ఖాతా నుంచి ఆ పోస్టర్‌ను తొలగించింది.

ఫ్లోరిడాలో జరిగిన ఓ ప్రమాదానికి కారణమైన హర్జీందర్ సింగ్ అనే వ్యక్తిని ఉద్దేశించే ఆ పోస్టర్‌ను రూపొందించినట్లు విభాగం వివరణ ఇచ్చింది.

అయితే, పోస్టర్‌లో ఉపయోగించిన 'సింగ్' అనే పేరు,దక్షిణాసియా వ్యక్తి రూపాన్ని బట్టి మొత్తం సిక్కు, భారతీయ సమాజాన్నే అవమానించేలా ప్రచారం చేశారని విమర్శకులు ఆరోపించారు.

అమెరికాలో ట్రక్కింగ్ రంగంలో సిక్కు సమాజానికి గణనీయమైన ప్రాతినిధ్యం ఉంది.

ఈ నేపథ్యంలో కమర్షియల్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకున్న ప్రచారంలో సిక్కు వ్యక్తి రూపాన్ని,'సింగ్' పేరును ఉపయోగించడం మరింత వివాదానికి దారితీసింది.

దీంతో ఓ నిర్దిష్ట ఘటనపై ప్రచారం చేయాలన్న డీహెచ్‌ఎస్ వివరణపై కూడా విమర్శలు కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT