రష్యా: వార్తలు
18 Mar 2023
వ్లాదిమిర్ పుతిన్ఐసీసీ వారెంట్: పుతిన్ ఎప్పుడు అరెస్టు అవుతారు? నిపుణులు ఏం అంటున్నారు?
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పుతిన్ నిజంగా అరెస్టు అవుతారా? ఒకవేళ అరెస్టు అయితే ఎవరు అరెస్టు చేస్తారు?
15 Mar 2023
అమెరికానల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చేసిన రష్యా ఫైటర్ జెట్లు
అమెరికా నిఘా డ్రోన్ ప్రొపెల్లర్‌ను నల్ల సముద్రంపై రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టింది. దీంతో తమ MQ-9 రీపర్ డ్రోన్ నీటిలో కూలిపోయినట్లు అగ్రరాజ్యం తెలిపింది
13 Mar 2023
చైనావచ్చే వారం రష్యాకు జిన్‌పింగ్; జెలెన్స్కీ- పుతిన్ మధ్య సంధి కుదురుస్తారా?
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చే వారం రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ మాస్కోకు వెళ్లనున్నట్లు సమాచారం.
09 Mar 2023
ఉక్రెయిన్ఉక్రెయిన్పై క్షిపణులతో విరుచుపడ్డ రష్యా- ఆరుగురు పౌరులు మృతి
ప్రజలు నిద్రిస్తున్న సమయంలో గురువారం రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. క్షిపణుల ధాటికి కీవ్ సహా ఇతర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రష్యా దాడుల్లో ఆరుగురు పౌరులు మృతి చెందారు.
07 Mar 2023
వీసాలుభారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా
భారతదేశం-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంత దృఢమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం వీసా విధానాన్ని సడలించి, సరళీకృతం చేయబోతున్నట్లు రష్యా ప్రకటించింది. దీంతో రష్యా వెళ్లాలలనుకునే భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
04 Mar 2023
కోవిడ్Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య
రష్యన్ కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వీ'ని రూపొందించడంలో విశేషంగా కృషి చేసిన రష్యా శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్ మాస్కోలోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించారు. అతడిని బెల్ట్‌తో గొంతుకోసి హత్య చేసినట్లు రష్యా మీడియా కథనాలు శనివారం తెలిపాయి.
24 Feb 2023
ఉక్రెయిన్-రష్యా యుద్ధంరష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్; భారత్, చైనా దూరం
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి శుక్రవారం(ఫిబ్రవరి 24) నాటికి ఏడాది పూర్తయ్యింది. ఈ క్రమంలో ఇప్పటికైనా రష్యా యుద్ధాన్ని ఆపేసి ఉక్రెయిన్ను విడిచి వెళ్లాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానించారు. అయితే రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఓటింగ్‌లో భారత్- చైనా దూరంగా ఉన్నాయి.
21 Feb 2023
జో బైడెన్'బైడెన్ భద్రతకు మేము హామీ ఇచ్చాం'; ఉక్రెయిన్ రహస్య పర్యటనపై స్పందించిన రష్యా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రహస్య పర్యటనపై రష్యా స్పందించింది. బైడెన్ తమ నుంచి భద్రతా పరమైన హామీని అందుకున్న తర్వాతే ఉక్రెయిన్‌కు బయలుదేరినట్లు రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్ చెప్పారు.
14 Feb 2023
మోల్డోవాఉక్రెయిన్ మిత్రదేశం 'మోల్డోవా'పై తిరుగుబాటుకు పుతిన్ ప్లాన్; అమెరికా ఆందోళన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోల్డోవా దేశంపై తిరుగుబాటుకు కుట్ర పన్నారని వచ్చిన ఆరోపణలపై అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తం చేశారు.
13 Feb 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ'వెంటనే రష్యాను వీడండి'; తమ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు
రష్యాలో నివసిస్తున్న లేదా ప్రయాణించే అమెరికా పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని మాస్కోలోని యూఎస్ రాయబార కార్యాలయం తెలిపింది. కొత్తగా వెళ్లే వారు కూడా రష్యాకు వెళ్లవద్దని సూచించింది. అక్రమ నిర్బంధాల కారణంగా అమెరికా పౌరులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.
09 Feb 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏరష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: అమెరికా
రష్యా నుంచి ముడి చమురును భారత్ కొనుగోలు చేయడం వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్‌పై ఆంక్షలు విధించే ఉద్దేశం తమకు లేదని అమెరికాకు చెందిన ఐరోపా, యురేషియా వ్యవహారాల సహాయ కార్యదర్శి కరెన్ డాన్‌ఫ్రైడ్ తెలిపారు.
30 Jan 2023
బ్రిటన్నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను చంపేస్తానని బెదిరించారని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. యూకేపై క్షిపణిని వదలడానికి తనకు ఒక నిమిషం మాత్రమే పడుతుందని పుతిన్ హెచ్చిరినట్లు జాన్సన్ వెల్లడించారు. బీబీసీ రూపొందించిన 'పుతిన్ v ది వెస్ట్' అనే మూడు భాగాల డాక్యుమెంటరీలో ఈ సంచలన విషయాలను వెల్లడయ్యాయి.
25 Jan 2023
ఉక్రెయిన్ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం!
రష్యాతో జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ వీరోచితంగా పోరాడుతోంది. పుతిన్ సేనలను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అధునాతన భారీ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపాలని అమెరికా, జర్మనీ దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమెరికా, జర్మనీ తీసుకున్న ఈ నిర్ణయం రష్యాతో యుద్ధాన్ని పునర్మిస్తుందని ఉక్రెయిన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
21 Jan 2023
ఉజ్బెకిస్తాన్బాంబు బెదిరింపు: రష్యా నుంచి గోవా వస్తున్న విమానం ఉజ్బెకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు వస్తున్న చార్టర్డ్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో షాక్‌కు గురైన అధికారులు విమానాన్ని అత్యవరస ల్యాండింగ్ కోసం ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. శనివారం తెల్లవారుజామున జరిగన ఈ ఘటనతో అధికారులు హడలెత్తిపోయారు.