LOADING...
Trump:'సమయం ఆసన్నమైంది': గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా నియంత్రణలోకి తీసుకురావడంపై ట్రంప్‌ కీలక పోస్ట్
గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా నియంత్రణలోకి తీసుకురావడంపై ట్రంప్‌ కీలక పోస్ట్

Trump:'సమయం ఆసన్నమైంది': గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా నియంత్రణలోకి తీసుకురావడంపై ట్రంప్‌ కీలక పోస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

వ్యూహాత్మకంగా,సహజ వనరుల పరంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న గ్రీన్‌లాండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలను గ్రీన్‌లాండ్‌తో పాటు డెన్మార్క్‌,ఇతర ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ డెన్మార్క్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌లాండ్‌ భద్రతకు రష్యా నుంచి ముప్పు ఉందని నాటో గత రెండు దశాబ్దాలుగా హెచ్చరిస్తున్నప్పటికీ, డెన్మార్క్‌ సరైన చర్యలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. రష్యా ప్రభావాన్ని అడ్డుకోవడంలో డెన్మార్క్‌ విఫలమైందని,అందుకే భద్రతా అవసరాల దృష్ట్యా ఇప్పుడు అమెరికా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. సమయం ఆసన్నమైనందునే ఈ అంశంలో తాము ముందుకు వచ్చామని,ఎట్టి పరిస్థితుల్లోనైనా గ్రీన్‌లాండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్‌ స్పష్టం చేశారు.

వివరాలు 

గ్రీన్‌లాండ్‌ ఎప్పటికీ డెన్మార్క్‌కు చెందిన భూభాగమే..

ఇదే సమయంలో, గ్రీన్‌లాండ్‌ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వని దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్‌ చేసిన ప్రకటనపై బ్రిటన్‌తో పాటు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అమెరికా చర్యలపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ స్పందిస్తూ, ట్రంప్‌ బెదిరింపులకు తాము తలవంచబోమని స్పష్టంగా చెప్పారు. గ్రీన్‌లాండ్‌ ఎప్పటికీ డెన్మార్క్‌కు చెందిన భూభాగమేనని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన శక్తివంతమైన వాణిజ్య ఆయుధంగా పిలవబడే 'ట్రేడ్‌ బజూకా'ను తొలిసారిగా వినియోగించడంపై కూడా ఆలోచిస్తున్నామని మెక్రాన్‌ తెలిపారు.

Advertisement