LOADING...
Ukraine war briefing: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు.. 450 డ్రోన్లు, 70 క్షిపణులు ప్రయోగం
ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు.. 450 డ్రోన్లు, 70 క్షిపణులు ప్రయోగం

Ukraine war briefing: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు.. 450 డ్రోన్లు, 70 క్షిపణులు ప్రయోగం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో దాడులకు తెగబడిందని అధ్యక్షుడు వ్లోదిమిర్‌ జెలెన్‌స్కీ మంగళవారం వెల్లడించారు. మొత్తం 450 దీర్ఘశ్రేణి డ్రోన్లతో పాటు వివిధ రకాల 70 క్షిపణులను ప్రయోగించిందని తెలిపారు. కీవ్‌లో నాటో కూటమి సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్‌ పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందు ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే, అబుధాబీలో అమెరికా మధ్యవర్తిత్వంతో బుధవారం శాంతి చర్చలు మళ్లీ ప్రారంభం కానున్న సమయంలోనే రష్యా దాడుల తీవ్రతను పెంచిందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ప్రధానంగా విద్యుత్‌ మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడినట్లు జెలెన్‌స్కీ తెలిపారు.

వివరాలు 

విద్యుత్‌ సరఫరాను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే రష్యా దాడులు 

చలి తీవ్రంగా ఉన్న వేళ ఉక్రెయిన్‌ ప్రజలకు అవసరమైన వెలుగు, వేడి అందించే విద్యుత్‌ సరఫరాను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే రష్యా ఈ దాడులకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు గగనతల రక్షణ వ్యవస్థలను అందించాలని, రష్యా దురాక్రమణను నిలువరించేందుకు అంతర్జాతీయంగా మరింత ఒత్తిడి తేవాలని మిత్ర దేశాలను ఆయన కోరారు. అదే సమయంలో, ఉక్రెయిన్‌లోని ఐదు ప్రాంతాలపై రష్యా ఒకేసారి దాడులు నిర్వహించిందని ప్రైవేటు విద్యుత్‌ సంస్థ డీటెక్‌ వెల్లడించింది. ఈ ఏడాది తమ విద్యుత్‌ నెట్‌వర్క్‌పై జరిగిన అత్యంత భారీ దాడి ఇదేనని సంస్థ స్పష్టం చేసింది.

Advertisement