LOADING...
USA: అమెరికా కీలక నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ నిలిపివేత
అమెరికా కీలక నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ నిలిపివేత

USA: అమెరికా కీలక నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ నిలిపివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
07:58 am

ఈ వార్తాకథనం ఏంటి

వలసదారుల అంశంలో ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, రష్యా సహా మొత్తం 75 దేశాల పౌరులకు అమెరికా వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేయనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ దేశాల నుంచి వచ్చే వారు అమెరికా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అధికంగా ఆధారపడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ 'ఎక్స్‌' (ట్విటర్‌) వేదికగా స్పందించింది.

వివరాలు 

ఈ నెల 21 నుంచి అమల్లోకి..

''75 దేశాల పౌరులు అమెరికా ప్రజల నుంచి అంగీకరించలేనంత ఎక్కువగా సంక్షేమ ప్రయోజనాలు పొందుతున్నారు. అందుకే వారికి ఇమ్మిగ్రెంట్‌ వీసాల ప్రాసెసింగ్‌ను నిలిపివేయాలని నిర్ణయించాం. కొత్తగా వచ్చే వలసదారులు అమెరికన్ల సంపదపై భారంగా మారరని, దేశ ప్రయోజనాలను కాపాడతారని పూర్తి స్థాయిలో నిర్ధారణ అయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ట్రంప్‌ ప్రభుత్వం ఎప్పుడూ అమెరికా ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తుంది'' అని పేర్కొంది. ఈ 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ నిలిపివేత ఈ నెల 21 నుంచి అమల్లోకి రానుందని ఓ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్‌, బ్రెజిల్‌, ఈజిప్టు, ఇరాన్‌, ఇరాక్‌ వంటి దేశాలు కూడా ఉన్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జాబితాలో పాక్, రష్యా, బంగ్లాదేశ్, నేపాల్, బ్రెజిల్, ఇరాన్‌ 

Advertisement