LOADING...
Tirumala: చంద్రగ్రహణం ప్రభావం.. నేడు, రేపు శ్రీవారి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు
చంద్రగ్రహణం ప్రభావం.. నేడు, రేపు శ్రీవారి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

Tirumala: చంద్రగ్రహణం ప్రభావం.. నేడు, రేపు శ్రీవారి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల 3వ తేదీన సంభవించే చంద్రగ్రహణం దృష్ట్యా, 2, 3వ తేదీలకు సంబంధించిన శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లను రద్దు చేసినట్లు టీటీడీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రకారం, 3వ తేదీకి ముందు 1, 2వ తేదీల్లో తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయరు. తిరిగి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను మాత్రం 3వ తేదీన జారీ చేస్తారు. అలాగే 3వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసినందున, 2వ తేదీన ఆ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించమని తితిదే స్పష్టం చేసింది.

Advertisement