Ukraine: 1.20 లక్షల గ్లైడ్ బాంబుల తయారీకి రష్యా ప్రణాళికలు.. ఉక్రెయిన్ తీవ్రమైన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం తగ్గే లక్షణాలు కన్పించకపోవడంతో రష్యా-ఉక్రెయిన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా 1,20,000 గ్లైడ్ బాంబులు తయారుచేయాలని ప్రణాళికలు సిద్ధం చేసిందని ఉక్రెయిన్ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. వీటిలో 500 కొత్త లాంగ్-రేంజ్ వేరియంట్ కూడా ఉండి, ఈ ఏడాది చివరినాటికి తయారీ పూర్తవుతుందని తెలిపారు. ఈ కొత్త బాంబులు 12 కి.మీ.కు పైగా దూరంలోని లక్ష్యాలను కూడా భేదించే సామర్థ్యం కలిగి ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యన్ దళాలు రోజుకు 200 నుంచి 250 వరకు గ్లైడ్ బాంబులు ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలపై ప్రయోగిస్తున్నాయని ఆ అధికారి తెలిపారు.
Details
రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు
ప్రతి దశలో రష్యా ఈ బాంబుల పరిధిని పెంచుతూ వస్తోందని, ఇకపై 400 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేసే ఆయుధాల తయారీకి సిద్ధమవుతోందని వెల్లడించారు. ఈ అభివృద్ధులతో ఉక్రెయిన్‌కు భారీ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా దాడులను ఎదుర్కొనేందుకు కీవ్ సేనలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు రష్యా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కీవ్ పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆరోపణలను మాత్రం మాస్కో ఖండిస్తోంది. 2022లో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడి ప్రారంభమైన తర్వాత రష్యా ఆయుధ ఉత్పత్తిని భారీగా పెంచింది.
Details
గత నెలలో సైన్యం విస్తృత స్థాయిలో అణు విన్యాసాలు
దేశవ్యాప్తంగా రక్షణ రంగానికి చెందిన కర్మాగారాలు 24 గంటలు పనిచేస్తున్నాయి. ఇదిలా ఉండగా, గత నెలలో రష్యా సైన్యం విస్తృత స్థాయిలో అణు విన్యాసాలు నిర్వహించింది. వాటిని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అణుశక్తితో నడిచే సబ్‌మెర్సిబుల్ డ్రోన్ 'పోసిడాన్'తో పాటు 'బురెవెస్ట్‌నిక్' క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు సైన్యాధికారులతో జరిగిన సమావేశంలో పుతిన్ వెల్లడించారు.