పోలవరం: వార్తలు

పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని పేర్కొంది. 1980 ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానం చెప్పారు.

పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టుపై గురువారం కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంలో నీటి నిల్వ ప్రస్తుతం 41.15 మీటర్లకే పరమితం చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్రం పేర్కొంది.