ఏపీ పోలవరానికి నిధుల ప్రవాహం... అదనంగా రూ.12,911 కోట్లు శాంక్షన్
పోలవరం నేషనల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కు అదనంగా రూ.12,911.15 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్రంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన అలుపెరగని ప్రయత్నాలు, చర్చలు, సంప్రదింపుల ఫలితమే ఈ ఫలితమని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. మంజూరైన రూ.12,911 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లు తెదేపా హయాంలో కట్టిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, నాసిరకంగా ఉండటం వల్ల, ఆ అదనపు ఖర్చును భర్తీ చేసేందుకూ నిధులు అందిస్తున్నారని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.