LOADING...
Miss Grand AP: మిస్‌ గ్రాండ్‌ ఏపీ -2026గా డాక్టర్‌ దివ్య వారణాసి
మిస్‌ గ్రాండ్‌ ఏపీ -2026గా డాక్టర్‌ దివ్య వారణాసి

Miss Grand AP: మిస్‌ గ్రాండ్‌ ఏపీ -2026గా డాక్టర్‌ దివ్య వారణాసి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2026
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో జరిగిన మిస్‌ గ్రాండ్‌ ఆంధ్రప్రదేశ్ పోటీలలో డాక్టర్‌ దివ్య వారణాసి అగ్రస్థానం సాధించారు. ఈవిషయాన్ని మిస్‌ గ్రాండ్‌ ఏపీ-తెలంగాణ డైరెక్టర్, ఇలాహే మోడలింగ్‌-ఫినిషింగ్‌ స్కూల్ స్థాపకురాలు భారతి బెర్రి ప్రకటించారు. వైద్య రంగంలో ఉన్న దివ్య, మోడలింగ్‌లో గల తన ఆసక్తిని మరింత పెంచుకుని శిక్షణ పొందిన తరువాత, 100 మందికి పైగా పోటీదారులు పాల్గొన్న గ్రాండ్‌ ఫినాలేలో శ్రేష్ఠతను సాధించడం గమనార్హం. దివ్య ఈ కిరీటాన్ని మిస్‌ గ్రాండ్‌ ఇండియా-2025 విజేత, విశాఖ కన్వర్ సమక్షంలో అందుకున్నారు. ఏప్రిల్‌లో జరిగే మిస్‌ గ్రాండ్‌ ఇండియా జాతీయ స్థాయి పోటీలలో ఆమె ఏపీ ప్రతినిధిగా పాల్గొననున్నారు. ఈవేదిక ద్వారా మహిళల ఆరోగ్య అవగాహన, సాధికారతపై దివ్య దృష్టి సారించనున్నట్లు ఆమె తెలిపారు.

Advertisement